Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా సహాయం అందని భాదిత జర్నలిస్ట్ కుటుంబాలతో మీడియా అకాడమీ ముట్టడి!

కరోనా సహాయం అందని భాదిత జర్నలిస్ట్ కుటుంబాలతో మీడియా అకాడమీ ముట్టడి!
-చనిపోయిన ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి 10 లక్షలు సహాయం అందించాలి
-కరోనా భారిన పడిన జర్నలిస్టులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం
-టార్గెట్ టార్చర్లపై ఆందోళన … యాజమాన్యాల వైఖరి ఎండగట్టాలని నిర్ణయం
-జర్నలిస్ట్ ల హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల ప్రభుత్వ వైఖరి గర్హనీయం
-చెల్లు బాటు కానీ హెల్త్ కార్డులతో జరలిస్ట్ ల ఆందోళన
-ఇల్లు ,ఇళ్ల స్థలాలపై సీఎం వాగ్దానం అమలుకు నోచుకోక పోవడంపై ఆగ్రహం
-జర్నలిస్ట్ ల సమస్యలపై సీఎం లేఖ రాయాలని…సీఎం నుంచి సానుకూల స్పందన లేకపోతె …
-ఆందోళనలకు సిద్ధంగా ఉండాలని టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సమావేశం పిలుపు

కరోనా చనిపోయిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మీడియా అకాడమిని ముట్టడించాలని హైద్రాబాద్ లో జరిగిన టీయుడబ్ల్యుజె (ఐజేయూ ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం పిలుపు నిచ్చింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మాటలు తప్ప ఆచరణలో అమలు నోచుకోవడం లేదని సమావేశం మండిపడింది. వివిధ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు గొప్పలు చెబుకుంటున్న పాలకులు జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) నాయకత్వం ప్రశ్నించింది.
ఆదివారం నాడు హైదర్ గుడ లోని సెంటర్ పార్క్ హోటల్ కాన్ఫరెన్స్ హాలులో టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై దాదాపు 6 గంటల పాటు సమావేశం చర్చించింది. చనిపోయిన ప్రతి జర్నలిస్ట్ కుటుంబాన్ని 10 లక్షల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. టార్గెట్ ల పేరుతొ యాజమాన్యాలు జర్నలిస్టులను వేదించడంపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ వార్త పీసీ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ గౌడ్ ను వార్త యాజమాన్యం 50 లక్షల యాడ్స్ ఇవ్వాలని టార్గెట్ పెట్టి వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకోవటం పట్ల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. వివిధ పత్రికల యాజమాన్యాలు కూడా ఇదే పద్దతి అవలంభిస్తున్నాయని దీనిపై పెద్ద ఎత్తున సభలు సమావేశాలు పెట్టి యాజమాన్యాల వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించింది. జర్నలిస్టులకు హెల్త్ కార్డు లు ఉన్నా అవి చెల్లు బాటు కాకపోవడం అనేక మంది జర్నలిస్టులు పడ్డ ఇబ్బందులపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. భాదిత జర్నలిస్ట్ ల కుటంబాలు ఇబ్బందుల్లో ఉన్నా వారికీ ప్రభుత్వం అందిస్తామన్న ఆర్థిక సహాయం సకాలంలో అందకపోవడం కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు సమావేశంలో వివరించారు. ఇల్లు ,ఇళ్ల స్థలాల విషయం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం నెరవేరక పోవడం గర్హనీయమని సమావేశం అభిప్రాయం పడింది. జర్నలిస్ట్ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాయాలని సమావేశం నిర్ణయించింది.

ముఖ్యంగా కోవిడ్ తో పాటు వివిధ సంఘటనల్లో అకాల మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలు దీనస్థితిలో జీవితాలు గడుపుతున్నా బాధితులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారకరమని ఐజేయూ జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ,మీడియా అకాడమీ నిర్లక్ష్య ధోరణిపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్ల విశ్వాసం లేనందున తమ యూనియన్ నుండి గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించడంతో పాటు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునే దిశలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
ఐజేయూ సీనియర్ నాయకులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ మీడియా సంస్థల యాజమాన్యాల యాడ్స్ టార్గెట్లను భరించలేక గ్రామీణ ప్రాంతాల్లో విలేఖరులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొనడం సహించరానిదన్నారు. యాజమాన్యాల వైఖరి మూలంగా మెదక్ జిల్లా నర్సాపూర్ లో వార్త విలేఖరి ప్రవీణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన, మరికొన్ని చోట్ల ఆత్మహత్యలకు విలేఖరులు ప్రయత్నించిన సంఘటనలను సీరియస్ గా తీసుకొని రాష్ట్ర,జాతీయ స్థాయిలో చర్చ జరిగే విధంగా తగు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేఖర్, విరాహత్ అలీలు మాట్లాడుతూ ఆర్థిక సహకారం కోసం మీడియా అకాడమీకి కోవిడ్ బాధిత జర్నలిస్టులు దరఖాస్తులు సమర్పించి నెలలు గడుస్తున్నా వారికి సహకారం అందడం లేదని, వెంటనే అకాడమీ స్పందించకుంటే బాధితులతో ఆందోళన కార్యక్రమం చేపట్టక తప్పదని వారు హెచ్చరించారు. అక్టోబర్ మాసాంతరం వరకు 33 జిల్లాల్లో సభ్యత్వాల నమోదు ప్రక్రియను పూర్తిచేసి, నవంబర్ మాసాంతరం వరకు సర్వసభ్య సమావేశాలను పూర్తి చేయాల్సిన బాధ్యతా జిల్లా శాఖలపై ఉంటుందని వారు సూచించారు. సమావేశానికి ముందు ఇటీవలీ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందిన జర్నలిస్టులకు నివాళి అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం పలు తీర్మానాలను కార్యవర్గ సమావేశం ఆమోదించింది.
ఇంకా ఈ సమావేశంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు దాసరి కృష్ణారెడ్డి, కల్లూరి సత్యనారాయణ, పిసిఐ సభ్యులు ఎం.ఏ.మాజిద్, టీయుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె . రాంనారాయణ, కరుణాకర్, కోశాధికారి మహిపాల్, రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ లతో రాష్ట్ర కార్యవర్గం, 26 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొని జిల్లాలలో జర్నలిస్లు ఎదుర్కొంటున్న సమస్యలను హెల్త్ కార్డులు , ఇల్లు ,ఇళ్ల స్థలాలపై , కరోనా భాదితుల కు సహాయం అందాకా పోవడాన్ని సమావేశం దృష్టికి తెచ్చారు. జర్నలిస్టుల సమస్యలపై సమగ్ర కార్యాచరణ రూపొందించి ఆందోళనలకు సిద్ధం కావాలని సమావేశం నిర్ణయించింది.

Related posts

వివాహానికి ముందు గుండెపోటుతో వధువు మృతి.. ఆమె చెల్లెలితో పెళ్లి!

Drukpadam

సోము వీర్రాజు శాసనమండలి సభ్యత్వం నేటితో పూర్తి..

Drukpadam

ఇచ్చిన మాట ప్రకారం ‘పెద్దమ్మాకు సెల్ ఫోన్ పంపిన సీఎం జగన్!

Drukpadam

Leave a Comment