Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తీన్మార్ మల్లన్న కష్టాలపై కేంద్ర హోమ్ మంత్రిని కలిసి ఫిర్యాదు చేసిన ఆయన భార్య !

ఢిల్లీలో అమిత్ షాను కలిసిన తీన్మార్ మల్లన్న భార్య.. కేసుల వివరాలతో కూడిన లేఖ అందజేత
-ఎంపీ అరవింద్, సోదరుడితో కలిసి ఢిల్లీలో షాను కలిసిన మాతమ్మ
-ఇప్పటి వరకు 35 కేసులు నమోదయ్యాయని ఫిర్యాదు
-ఒక కేసులో బెయిలు వస్తే మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారని ఆవేదన

ఇప్పటికే వరస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తీన్మార్ మల్లన్న …మరో కేసు వచ్చి పడింది ..ఆయన భార్య మతమ్మ ఢిల్లీ లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసి తన భర్తపై తప్పుడు కేసులు పెట్టి రాష్ట్రప్రభుత్వం వేధిస్తోందని ఆదుకోవాలని కోరారు.బీజేపీ ఎంపీ అరవింద్ తో కలిసి ఆమె హోమ్ మంత్రిని కలిశారు . మల్లన్న పై 35 కేసులు ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ లో కల్లు దుకాణం యజమాని తనను 5 లక్షలు ఇవ్వమని మల్లన్న వేధించారని కేసు పెట్టారు. మల్లన్న బీజేపీ లో చేరబోతున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే …..

క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నపై కేసులు ఒకదాని తర్వాత ఒకటిగా నమోదవుతున్న వేళ.. ఆయన భార్య మాతమ్మ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంపీ అరవింద్ కుమార్, సోదరుడితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆమె అమిత్ షాను కలిసి తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు.

అక్రమంగా కేసులు పెట్టి మల్లన్నను వేధిస్తున్నారని ఆరోపించారు. కేసు మీద కేసు పెడుతూ జైలుకు పంపే కుట్ర చేస్తున్నారని, ఇప్పటి వరకు 35 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కేసులో బెయిలు వస్తే మరో కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు మల్లన్నపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలతో కూడిన లేఖను అందించారు. కాగా, మల్లన్న బీజేపీలో చేరబోతున్నట్టు ఇటీవల ఆయన చానల్ క్యూ న్యూస్ ప్రకటించింది.

రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడంటూ కల్లు వ్యాపారి ఫిర్యాదు..

వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై నిజామాబాద్ జిల్లాలో మరో కేసు నమోదైంది. తన నుంచి తీన్మార్ మల్లన్న రూ. 5 లక్షలు, ఉప్పు సంతోష్ రూ. 20 లక్షలు డిమాండ్ చేశారంటూ నిజామాబాద్‌కు చెందిన ఓ కల్లువ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్‌ను ఎ1గా, నవీన్‌ను ఎ2గా చేర్చారు. అనంతరం సంతోష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఓ కేసులో ఇప్పటికే జైలులో ఉన్న మల్లన్నకు ఈ కేసులో పీటీ వారెంట్ చేయనున్నట్టు పోలీసులు వర్గాలు తెలిపాయి.

Related posts

దేవుడి పథకాలు వేరేగా ఉంటాయి.. బ్రదర్ అనిల్ కుమార్!

Drukpadam

మరోసారి వివాదంలో తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డా. శ్రీనివాసరావు!

Drukpadam

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రక్తపు మరకలు …

Drukpadam

Leave a Comment