Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రియాంక గాంధీ కొత్త అవతారం …

ప్రియాంక గాంధీ కొత్త అవతారం …
-అమ్మవారిని స్తుతిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రియాంక గాంధీ
-నుదుట చందనం, బొట్టుతో అచ్చంగా హిందూ మహిళను తలపించిన ప్రియాంక
-కిసాన్ న్యాయ్ ర్యాలీలో ఆకట్టుకున్న వైనం
-ర్యాలీ అనంతరం కాశీ విశ్వేశ్వరాలయ సందర్శన

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌‌లో రాజకీయం ఇప్పటి నుంచే వేడెక్కింది. అధికార ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రంజుగా మారింది. లఖింపూర్ ఖేరి ఘటన తర్వాత దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తాజాగా మరోమారు ప్రజల దృష్టిలో పడ్డారు. హిందూ ఓటర్లను లక్ష్యంగా చేసుకున్న ఆమె కొత్త అవతారంలో కనిపించారు. అచ్చంగా హిందూ మహిళను తలపించారు. బీజేపీ నిత్యం హిందూ జపం చేస్తూ హిందువుల ఓటు బ్యాంకు పై కన్నేసిన నేపథ్యం లో కాంగ్రెస్ కూడా కొత్త ఎత్తుగడలకు పదును పెట్టిందా ? అనే సందేహాలకు తావిస్తూ ఆమె మోడీ నియోజకవర్గం వారణాసి లో హల్చల్ చేశారు. నుదుటి బొట్టు , ఆమె ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.

వారణాసిలో నిన్న నిర్వహించిన ‘కిసాన్ న్యాయ్ ర్యాలీ’లో పాల్గొన్న ప్రియాంక నుదుటన చందనం, బొట్టుతో కనిపించారు. అంతేకాదు, నవరాత్రుల వేళ దుర్గా స్తుతితో ప్రసంగాన్ని ప్రారంభించి ఆకట్టుకున్నారు. నవరాత్రుల్లో నాలుగో రోజు కాబట్టి దుర్గా స్తుతితో ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. నవరాత్రుల ప్రారంభం రోజున ఉపవాసం ఉన్నట్టు చెప్పారు. ర్యాలీ అనంతరం కాశీ విశ్వేశ్వరుడిని, దుర్గామాత దేవీ ఆలయాలను దర్శించుకున్నారు.

Related posts

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం దీదీ ప్రయత్నాలు!

Drukpadam

కాంగ్రెస్ లో అధ్యక్ష మార్పిడి రేపే…

Drukpadam

వాళ్లు వైసీపీని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది: నాదెండ్ల మనోహర్!

Drukpadam

Leave a Comment