Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

“మా” లో ముసలం …పలువురు కొత్తగా ఎన్నికైన సభ్యులు పదవులకు గుడ్ బై !

“మా” లో ముసలం …పలువురు కొత్తగా ఎన్నికైన సభ్యులు పదవులకు గుడ్ బై !
-ఎన్నికల జరిగిన తీరుపై నిరసన …పోస్టల్ బ్యాలట్ లెక్కలపై అనుమానం
-“మా” ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా
-మీడియా సమావేశం లో వెల్లడించిన సభ్యులు
-మంచు విష్ణు స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని సూచన
ఓటర్ల తరఫున ప్రశ్నిస్తామని వివరణ
-పాల్గొన్న ప్రకాష్ రాజ్ , ఎక్సక్యూటివ్ వైస్ ప్రసిడెంట్ శ్రీకాంత్

“మా ” లో ముసలం పుట్టింది. నిన్న జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన ఎక్సక్యూటివ్ సభ్యులతోపాటు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు ప్యానళ్ల నుంచి గెలిచినందున గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతోనే తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
‘మా’ ఎన్నికలో ఓటమిపాలైన ప్రకాశ్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల వేళ రౌడీయిజం జరిగిందని, తమ ప్యానెల్ సభ్యుల పట్ల అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. ‘మా’ అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత మంచు విష్ణు మాట్లాడిన కొన్ని మాటలు బాధ కలిగించాయని అన్నారు. ఇప్పుడు అనేక పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తమ ప్యానెల్ నుంచి గెలుపొందిన సభ్యులు ‘మా’ కార్యవర్గం నుంచి తప్పుకుంటున్నారని వెల్లడించారు.

దీంతో “మా ” భవితవ్యం పై సందేహాలు నెలకొన్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన తాము కార్యవర్గ సమావేశాలలో పాల్గొంటే రచ్చ చేయదలుచుకోలేదని శ్రీకాంత్ ,బెనర్జీ , ప్రభాకర్ , తనిష్ , తదితరులు తెలిపారు. అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు బాగా చేయగలదని నమ్మకం ఉందని వారు పేర్కొన్నారు. అయితే నరేష్ మాటలు వింటే మాత్రం గతంలోలాగానే ఉంటుందని ఆరోపించారు. ఒకే ప్యానల్ గెలిస్తే బాగుండేందని అది ఎన్నికల్లో మేము మా ప్యానల్ ను గెలిపించామని కోరామని కానీ అది జరగలేదని అన్నారు. ఓట్ల లెక్కింపులో కూడా జరిగిన అవకతవకలను పలువురు సభ్యులు ఎత్తిచూపారు. ప్రత్యేకించి పోస్టల్ బ్యాలట్ ఓట్లను ఎన్నికల అధికారి తన ఇంటికి తీసుకోని పోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. “మా” ఐక్యంగా ఉండాలని , సభ్యుల సంక్షేమం కోసం పాటుపడాలని , ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలనీ , వారు డిమాండ్ చేశారు. లేకపోతె సభ్యులు తరుపున ప్రశ్నిస్తామని ,ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. అత్యంత బరువెక్కిన హృదయంతో రాజీనామాల నిర్ణయం ఆవేశంతో కాకుండా బాగా ఆలోచించిన తరువాతనే తీసుకున్నామని వారు వెల్లడించారు. మాకు పదవులు అవసరం లేదు సభ్యులు సంక్షేమం ముఖ్యం .అందుకు మాఅవసరం ఉంటె తప్పకుండ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

నా రాజీనామా ఉపసహంహరించుకుంటా …బట్ వన్ కండిషన్ :ప్రేక్ష రాజ్

తాను “మా” ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామా ఉపసంహరించు కుంటానని కానీ ఒక కండిషన్ అని ప్రకాష్ రాజ్ అన్నారు. అదేమంటే , “మా ” భాషకు ,ప్రాంతానికి , మతానికి సంబంధం లేకుండా ఎవరైనా పోటీ చేయవచ్చుననే నిబంధన ఉండాలని అందుకు “మా ” అధ్యక్షుడు విష్ణు అంగీకరిస్తే తన రాజీనామా వెనక్కు తీసుకుంటానని ప్రకాష్ రాజ్ అన్నారు . విష్ణు రెండు సంత్సరాలు బాగా పని చేయాలనీ కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. అవి జరగాలి , ఖాళీ అయిన స్థానాలలో మీ ఇష్టం వచ్చిన వాళ్ళను పెట్టుకోండని అన్నారు. మెంబర్స్ సంక్షేమం కోసం పని చేయకపోతే కచ్చితంగా ప్రశ్నిస్తామని అన్నారు.

‘మా’లో ఇక నరేశ్ హవానే నడుస్తుంది… ఇలాంటి పరిస్థితుల్లో మేం ఉండలేం: శ్రీకాంత్

తాము ఎవరికైనా ఒక ప్యానల్ కు ఓటు వేయమని చెప్పం , అందుకు విరుద్ధంగా జరిగింది. కలిసి పనిచేయడం సాధ్యమా అని అనేకమంది అడిగారు . అందరి అభిప్రాయాలూ తీసుకున్న తరువాత ఒక ప్యానల్ సభ్యులు ఉంటేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చాం . అందువల్ల రాజీనామా సరైన నిర్ణయమని అనుకున్నాం అందుకు అందరం రాజీనామా చేస్తున్నాం . విష్ణు బాగా చేయగలదని నమ్మకముంది. కానీ ఒక్కడా నరేష్ ఉన్నారు. ఆయన వల్ల గతంలో చాల గొడవలు జరిగాయి. వాటిని రిపీట్ చేస్తే సంఘం నష్టపోతోంది అని అభిప్రాయపడ్డారు.

మోహన్ బాబు అరగంటసేపు బూతులు తిట్టారు:
కన్నీటిపర్యంతమైన బెనర్జీ

మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి నటుడు బెనర్జీ వైస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించారు. ఇవాళ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నిర్వహించిన మీడియా సమావేశంలో బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ రోజున తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుని బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నికల్లో తాను నెగ్గానని ఇతరులు చెబుతున్నప్పటికీ తాను ఓ చలనం లేని వాడిలా ఉండిపోయానని, ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోయానని వణుకుతున్న స్వరంతో చెప్పారు. ఆ పరిస్థితికి కారణమేంటో బెనర్జీ వివరించారు.

“పోలింగ్ రోజున బూత్ వద్ద దూరంగా నిలబడ్డాను. తనీశ్ ను మోహన్ బాబు తిట్టడం చూశాను. అక్కడే విష్ణు కూడా ఉండడంతో నేను ఆయన వద్దకు వెళ్లి… గొడవలు వద్దని చెప్పాను. దాంతో మోహన్ బాబు కోపంతో ఊగిపోయారు. అరగంటసేపు పచ్చిబూతులు తిట్టారు. కొట్టబోయారు.

ఒకప్పుడు మోహన్ బాబు మా ఇంటి మనిషిగా, నేను మోహన్ బాబు ఇంటి మనిషిగా ఉన్నాం. మంచు లక్ష్మి పుట్టినప్పుడు ఆమెను ఎత్తుకుని తిరిగాను. విష్ణును ఎత్తుకుని తిరిగాను. అలాంటిది అమ్మనా బూతులు తిట్టారు. ఆయన అలా తిడుతూ ఉంటే విష్ణు, మనోజ్ వచ్చి సారీ అంకుల్… ఆయనను మళ్లీ ఏమీ అనవద్దు అని రిక్వెస్ట్ చేశారు. ఆయన డీఆర్సీ సభ్యుడు అయివుండీ కూడా ఇలా ప్రవర్తించారు. ఇతర డీఆర్సీ సభ్యులు కూడా దీన్ని అడ్డుకోలేదు. ఆ సమయంలో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ దూరంగా ఉన్నారు. పాపం తనీశ్ ఏడుస్తూ ఉండిపోయాడు.

ఆ తర్వాత మోహన్ బాబు అర్ధాంగి నిర్మల ఫోన్ చేసి చాలా బాధపడ్డారు. ఆ ఘటనను మర్చిపోలేకపోతున్నాను. మూడు రోజుల నుంచి ఒకటే వేదన. అందుకే మా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. అప్పుడన్నా నా బాధ తగ్గుతుందేమో!” అని వివరించారు.

Related posts

చంద్రబాబుకు ఫోన్ చేసి సూపర్ స్టార్ రజనీకాంత్

Drukpadam

తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోంది: గవర్నర్ తమిళిసై!

Drukpadam

రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు.. రూ. 800 కోట్ల నల్లధనం లావాదేవీల గుర్తింపు!

Drukpadam

Leave a Comment