Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారు: పొన్నాల
రాష్ట్ర పరిధిలోని నీటిపై కేంద్రం పెత్తనమేంటి?
కేంద్రం జోక్యానికి రెండు రాష్ట్రాలు అవకాశం ఇచ్చాయి
అక్టోబరు 14 తెలంగాణకు బ్లాక్ డేగా నిలిచిపోతుంది
కేసీఆర్ ప్రభుత్వం ఒక్క మెగావాట్ విద్యుత్‌ను కొత్తగా ఉత్పత్తి చేయలేదు

రాష్ట్ర పరిధిలో ఉన్నా ప్రాజక్టులపై కేంద్ర పెత్తనం ఏమిటి ? నీటివాటాల విషయంలో ఏపీ , తెలంగాణ పరిష్కరించుకోవాల్సింది పోయి కేంద్రం చేతులో పెట్టడం తెలియితక్కువతనం ఇందుకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కేసీఆర్ ద్రోహిగా మిగిలిపోతాడని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు . కేంద్రం జ్యోక్యానికి అవకాశం కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన నిన్నటి రోజు బ్లాక్ డే గా చరిత్రలో నిలిచి పోతుందని ధ్వజమెత్తారు . ఇందుకు రెండు రాష్ట్రాలు భాద్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తుందని పొన్నాల విమర్శలు గుప్పించారు.

ఒంటెత్తు పోకడలతో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని, చివరికి ఆయన తెలంగాణ ద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్ర పరిధిలోని నీటి వ్యవహారాలపై కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. అసలు కేంద్రం జోక్యానికి అవకాశం ఇస్తున్న తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలది తప్పేనని అన్నారు. అక్టోబరు 14 తెలంగాణకు బ్లాక్‌డేగా నిలిచిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభంపై మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మెగావాట్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయలేకపోయిందని విమర్శించారు. బొగ్గు లేక దేశవ్యాప్తంగా పలు పవర్ ప్లాంటులు మూతపడుతున్నాయని, బీజేపీ ఎన్ని అబద్ధాలు చెబుతున్నా నిజం ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు.

వైఎస్సార్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఒకేసారి 86 ప్రాజెక్టులు ప్రారంభించామని, కేసీఆర్ ఇప్పుడు వెలగబెట్టేదేముందని ప్రశ్నించారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం వల్ల ఏమాత్రం లాభం జరిగిందో చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు.

Related posts

హరీశ్ రావు డ్రామాలకు అప్పట్లో శ్రీకాంతాచారి బలయ్యాడు: రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

నాపై అసత్య ప్రచారాలు మాని మీగురించి పార్టీ గురించి చూసుకోండి ..కేశినేని నానికి సీఎం రమేష్ హితవు …

Drukpadam

ఖర్గే, థరూర్ గొప్ప స్థాయి కలిగిన వ్యక్తులు..రాహుల్ గాంధీ

Drukpadam

Leave a Comment