Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఛత్తీస్ గఢ్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు….

ఆర్ఎస్ఎస్ ను నక్సల్స్ తో పోలుస్తూ… ఛత్తీస్ గఢ్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
తెలంగాణ, ఏపీల్లోనే నక్సల్ నాయకులున్నారు
ఛత్తీస్ గఢ్ లో నక్సలిజాన్ని నడుపుతున్నారు
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలూ పాలనకు విఘాతం కలిగిస్తున్నారన్న సీఎం

తెలుగు రాష్ట్రాలపై ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను నక్సలైట్లతో పోల్చిన ఆయన.. తెలంగాణ, ఏపీకి లింకులు పెట్టారు. నక్సలైట్ల నాయకులు తెలంగాణ, ఏపీలో ఉంటే.. ఆర్ఎస్ఎస్ నేతలు నాగపూర్ లో ఉన్నారని అన్నారు.

వారి ఆదేశాల ప్రకారమే ఛత్తీస్ గఢ్ లో అరాచకాలకు పాల్పడుతున్నారని కామెంట్ చేశారు. తెలంగాణ, ఏపీల్లోని నక్సలైట్ నాయకులు ఇచ్చే ఆదేశాలతో.. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు అకృత్యాలకు తెగబడినట్టే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలూ పాలనకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. తెలంగాణ, ఏపీల్లో నక్సల్ నాయకులున్నారని, ఛత్తీస్ గఢ్ లో నక్సలిజాన్ని అమలు చేస్తున్నారని అన్నారు.

కబీర్ ధాం జిల్లాలోని కావర్దాలో గతవారం జరిగిన అల్లర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్ అనుసూయి ఉయికే రాసిన లేఖకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు. రాష్ట్ర అభ్యున్నతికి పదిహేనేళ్లలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిందేమీ లేదన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. తీవ్రవాద భాష మాట్లాడుతున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు లో పార్టీ సత్తా తేలాలి :పార్టీ ఇంచార్జి శివకుమార్

Drukpadam

పవన్ కల్యాణ్ ఇంటివద్ద రెక్కీ చేస్తారా… బతకనివ్వరా?: చంద్రబాబు

Drukpadam

దళిత బందు కొత్త చిక్కులు …లబ్ది దారుల ఎంపికపై గరం గరం!

Drukpadam

Leave a Comment