Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ పగ్గాలు కేటీఆర్ కేనా …?

టీఆర్ యస్ పగ్గాలు కేటీఆర్ కేనా …?
ప్రస్తుతం వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్న కేటీఆర్
పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్న వైనం
కేటీఆర్ చెప్పిందే పార్టీ లో వేదం
ముందు పార్టీ పగ్గాలు తరువాత సీఎం సీటు
ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్న టీఆర్ యస్ శ్రేణులు

ఈనెల 25 టీఆర్ యస్ అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు. హైద్రాబాద్ లో జరిగే రాష్ట్ర ప్లీనరీ సమావేశంలో అధ్యక్షుడి ఎన్నికకు షడ్యూల్ సైతం ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికకు నామినేషన్లు కూడా స్వీకరించనున్నారు. అందువల్ల ముందుగానే అధ్యక్షుడు కేసీఆర్ అవుతారా ? కేటీఆర్ ను ఎన్నుకుంటున్నారా? అనేది తేలుతుంది. కేటీఆర్ కు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఏడాది క్రితం కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారం సామాన్యులు చేసింది కాదు , మంత్రులు , ఎమ్మెల్యే లు చేశారు . ఇందుకు సీఎం ఓ గాని కేటీఆర్ గాని ఖండించక పోవడంతో త్వరలో కేటీఆర్ సీఎం కాబోతున్నారని టీఆర్ యస్ శ్రేణులు భావించాయి. దీంతో అంతకుముందు ఆయనకు సన్నిహితంగా లేని రాజకీయ నాయకులూ , అధికారులు ఆయన చుట్టూ చేరడం ప్రారంభించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయంకు దీటుగా కేటీఆర్ కార్యాలయం కు రద్దీ పెరిగింది. అధికారులు సీఎం ఆదేశాలకన్నా కేటీఆర్ ఆదేశాలకోసం చూచేవారని ,అన్ని శాఖల్లో ఆయన మంచి పట్టు సాధించారని చెప్పుకుంటారు. పార్టీ సమావేశంలో కేసీఆర్ ముఖ్యమంత్రి మార్పులేదు ఏమి లేదని మరో 10 సంత్సరాలు తానే ముఖ్యమంత్రిని అని చెప్పే వరకు ఈ ప్రచారం ఆగలేదు .

హిందీ , ఇంగ్లీష్ , తెలుగు భాషల్లో మంచి పట్టు ఉండటం తో ఇతర దేశాలు , రాష్ట్రాల నుంచి వచ్చే వారు సైతం కేటీఆర్ ను కలవకుండా వెళ్లిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి . మంచి మాటకారిగా ,సౌమ్యుడిగా పేరుంది . అన్ని విషయాలను వినడంతోపాటు వాటిని ఆకళింపు చేసుకోవడం , కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండటంతో పాటు టెక్నాలజీ ఉపయోగించడంలో దిట్టగా పేరుంది. కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా విషయం తెలిస్తే వెంటనే రెస్పాండ్ అవుతాడనే విశ్వాసాన్ని కలిగించారు. ఇప్పుడు ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలు కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. అందుకే సముర్తుడగా పేరుతెచ్చుకున్న కేటీఆర్ కు పార్టీపగ్గాలు అప్పచెప్పాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మంత్రిగా ,పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా వివాద రహితుడిగా, ప్రత్యర్థులు సైతం ఆయన సమర్థతపై వేలెత్తి చూపే అవకాశం లేకుండా ఉన్నారు .అందువల్ల కేటీఆర్ కు అధ్యక్ష భాద్యతలు అప్పగించటం సమంజసంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ మదిలో ఏముందో , పార్టీ ప్లీనరీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి ….!

Related posts

మ‌రి అప్పుడే ఈట‌ల‌ ఎందుకు రాజీనామా చేయ‌లేదు?: టీఆర్ఎస్ నేత ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి

Drukpadam

ఇది ఆరంభం మాత్రమే.. సీఎం కేసీఆర్ కు ఈటల హెచ్చరిక!

Drukpadam

రోడ్డు మార్గంలో పోలీసులు అడ్డుకోవడంతో హెలికాప్టర్ లో వెళ్లిన రాహుల్ గాంధీ…

Drukpadam

Leave a Comment