Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్రమంత్రి తీరు బాధాకరం …పరామర్శకు వచ్చారా ?ఫోటోల కోసమా ?

కేంద్రమంత్రి తీరు బాధాకరం …పరామర్శకు వచ్చారా ?ఫోటోల కోసమా ?
ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని మన్మోహన్
పరామర్శించేందుకు వచ్చిన కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ
కేంద్ర ఆరోగ్య మంత్రిపై మన్మోహన్‌ కుటుంబం ఆగ్రహం
ఫొటోగ్రాఫర్ ను వెంటబెట్టుకుని వెళ్లిన మన్ సుఖ్ మాండవీయ
ఫొటోగ్రాఫర్ వద్దని చెప్పినా పట్టించుకోని వైనం

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తీరు బాధాకరమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్మోహన్ అనారోగ్యం తో ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పరామర్శించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మం సుఖ్ మాండవీయ వెళ్లారు. ఇంతవరకు బాగానే ఉంది.కానీ ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఒక ఫోటో గ్రాఫర్ ను కూడా వెంట బెట్టుకొని వెళ్లి పరామర్శ ఫోటో లు తీయించడంపై కుటంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయిన వారి మాటలు పట్టించుకోకుండా ఆయన వ్యవహరించడం విమర్శలకు దారితీసింది.

కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో మన్మోహన్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు ఆరోగ్య మంత్రి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు.

ఈ సందర్భంగా మన్మోహన్ తో మాండవీయ ఫొటోలు తీయించుకున్నారు. ఫొటోగ్రాఫర్ ను అనుమతించవద్దని కుటుంబసభ్యులు చెపుతున్నా ఆయన పట్టించుకోలేదట. ఈ అంశంపై మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ ఈరోజు ఒక ప్రకటన ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తమ మాటలను పట్టించుకోకుండా తన తండ్రితో కలిసి మాండవీయ ఫొటోలు తీయించుకున్నారని ఆమె చెప్పారు. ఫొటోగ్రాఫర్ ను తీసుకురావద్దని చెప్పినా ఆయన పట్టించుకోలేదని అన్నారు. తన తండ్రికి రోగనిరోధకశక్తి చాలా తక్కువగా ఉందని… ఇన్ఫెక్షన్ సోకుతుందనే భయంతో సందర్శకులను తాము కట్టడి చేశామని తెలిపారు.

తన తండ్రిని పరామర్శించేందుకు కేంద్ర మంత్రి రావడం మంచిదేనని… అయితే ఆ సమయంలో ఫొటోలు దిగే పరిస్థితిలో తన తల్లిదండ్రులు లేరని చెప్పారు. ఫొటోగ్రాఫర్ ను గది నుంచి పంపించేయాలని తన తల్లి పట్టుబట్టినప్పటికీ ఆయన పట్టించుకోలేదని… తన తల్లి చాలా బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి డెంగ్యూతో బాధపడుతున్నారని… ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

Related posts

చంద్రబాబు తో గ్యాప్ వచ్చినమాట నిజం … గంటా

Drukpadam

టీడీపీ ,బీజేపీ బంధానికి సుజనా మంతనాలు …!

Drukpadam

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై సీఎం వివరణ సబబుగానే అనిపించింది: లక్ష్మీపార్వతి!

Drukpadam

Leave a Comment