Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

“మా” గొడవలకు శుభం కార్డు పడుతుందా ?లేదా ??

మాగొడవలకు శుభం కార్డు పడుతుందా ?లేదా ??
నావి కన్నీళ్లు కావుఆనందబాష్పాలు :నరేశ్
చిన్న పదవా? పెద్ద పదవా ? అనేది కాదు కుర్చీ గొప్పది :మోహన్ బాబు
వాగ్దానాలు పెద్దవి వాటిని నెరవేర్చేందుకు భగవంతుడు శక్తిని ప్రసాదించాలి
నేడు మంచు విష్ణు కార్యవర్గం ప్రమాణస్వీకారం
మా భవిష్యత్తుపై భరోసా ఏర్పడిందన్న నరేశ్
మంచు విష్ణు సమర్థుడని కితాబు
ఎవరికీ రిపోర్టు కార్డు ఇవ్వాల్సిన పనిలేదని వ్యాఖ్యలు
ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు కౌంటర్

అనేక సినిమాలకు శుభం కార్డు పలికే సినీ కళాకారులు వారి గొడవలకు మాత్రం శుభం కార్డు పలకటం లేదు . ఈ గొడవలకు ఎప్పడు శుభం కార్డు పడుతుందో , ఎప్పుడు పరస్పర విమర్శలు ఆగుతాయో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు. సినీ పరిశీలకులు …

 

‘మా’ నూతన కార్యవర్గం నేడు ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో నటుడు నరేశ్ స్పందించారు. ‘మా’ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలన్న ఉద్దేశంతోనే విష్ణుకు మొన్ననే బాధ్యతలు అప్పగించామని నరేశ్ వెల్లడించారు.

మొన్న విష్ణు బాధ్యతలు స్వీకరించిన రోజు తాను కన్నీళ్లతో ‘మా’ కార్యాలయం నుంచి బయటికి వచ్చానని, అయితే ఎందుకు తాను కన్నీళ్లు పెట్టుకున్నానో అప్పుడు ఎవరికీ అర్ధం కాలేదని అన్నారు. ‘మా’ పనితీరు మెరుగుపడేందుకు ఆరేళ్లు పోరాడానని, ఆరేళ్ల శ్రమకు ఒక మంచి భవిష్యత్ కనపడిందన్న నమ్మకంతో ఆ రోజున తాను ఆనందబాష్పాలు రాల్చానని వెల్లడించారు. మంచు విష్ణు నాయకత్వంలో ‘మా’ మరింత ముందుకు వెళుతుందన్న భరోసా కలిగిందని పేర్కొన్నారు.

గతంలో తాను ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కంటే నేడు విష్ణు అత్యధిక మెజారిటీతో గెలుపొందాడని కితాబునిచ్చారు. ‘మా’ సభ్యులకు విష్ణుపై ఉన్న నమ్మకమే భారీ మెజారిటీకీ కారణమని నరేశ్ వివరించారు.

ఇక, ‘మా ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు కూడా నరేశ్ స్పందించారు. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసినా బయట ఉంటూనే ‘మా’ తరఫున విష్ణు చేసే మంచి పనులకు మద్దతు ఇస్తామని, ప్రతి నెలా రిపోర్టు కార్డు అడుగుతామని ప్రకాశ్ రాజ్ అన్నారు. అందుకు నరేశ్ బదులిస్తూ, మంచు విష్ణు కార్యవర్గం ఎవరికీ రిపోర్టు కార్డు ఇవ్వాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. ‘మా’ పనితీరు వివరాలు కావాలంటే వెబ్ సైట్లో చూసుకోండి అని సూచించారు.

 

సినీ ప‌రిశ్ర‌మ‌లో రాజ‌కీయాలు ఎక్కువైపోయాయి: మోహ‌న్ బాబు వ్యాఖ్య‌లు

  • mohan babu on maa elections

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ మంచు మోహ‌న్ బాబు మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

‘చిత్ర‌పురి కాల‌నీని హెరిటేజ్ సైట్ కింద మార్చేసి, చుట్టూ ఉన్న కొండ‌ల‌ను ఏదో చేద్దామ‌ని ఓ స‌మ‌యంలో ఓ ముఖ్య‌మంత్రి ప్లాన్ చేశారు. త‌మ్ముడు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు కూడా తెలుసు. నేను అప్పుడు రాజ్య‌స‌భ స‌భ్యుడిని. అప్ప‌ట్లో నేను గ‌వర్న‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించా’ అని మోహ‌న్ బాబు చెప్పారు.

‘క‌ళాకారుల‌కు అన్యాయం జ‌ర‌గ‌కూడదని చెప్పాను. నేను ఏం చేశానో ప్ర‌కృతికి తెలుసు. ఆ దేవుడికి తెలుసు. ఆ భ‌గ‌వంతుడు ఉన్నాడు. మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించాడు. క‌లిసి మెల‌సి ఉంటూ కావ‌ల్సినవి సాధించుకుందాం. మా అనేది రాజ‌కీయ వేదిక కాదు.. క‌ళాకారుల వేదిక‌. సినీ ప‌రిశ్ర‌మ‌లో రాజ‌కీయాలు ఎక్కువైపోయాయి. సినీ ప‌రిశ్ర‌మ‌లో గెలుపు, ఓటుములు స‌హజం. మాలో మేమంతా ఒకే త‌ల్లి బిడ్డ‌లం’ అని మోహ‌న్ బాబు వ్యాఖ్యానించారు.

‘అయితే, క‌ళామ‌త‌ల్లి బిడ్డ‌ల్లో ఐక్యం లోపించింది. మా ఎన్నిక‌ల్లో నా బిడ్డ విష్ణుకు న‌రేశ్ సాయం చేశారు. అది మామూలు సాయం కాదు. చాలా కృషి చేశారు. విష్ణుకి ఎన్నో స‌ల‌హాలు ఇచ్చారు. న‌రేశ్ నా స్నేహితుడు కాదు. కానీ, ఆయ‌న తల్లిగారు విజ‌యనిర్మ‌ల గారు తీసిన సినిమాల్లో చేశాను. న‌రేశ్ తో మాత్రం ఎన్న‌డూ స‌న్నిహితంగా లేను. అయినప్ప‌టికీ ఆయ‌న వ‌చ్చి నా బిడ్డకు సాయం చేశారు’ అని మోహ‌న్ బాబు చెప్పారు.

 

  • మా ఎన్నికల వ్యవహారం ముగిసింది : మంచు విష్ణు
Manchu Vishnu taking oath as MAA President

‘మా’ నూతన అధ్యక్షుడిగా నటుడు మంచు విష్ణు నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మా’ ఎన్నికల వ్యవహారం ఇక ముగిసిందని, తాను గానీ, తన ప్యానెల్ సభ్యులు గానీ ఎన్నికల వ్యవహారంపై ఇక మీడియా ముందు మాట్లాడబోమని స్పష్టం చేశారు.

అయితే, హోరాహోరీగా జరిగిన ‘మా’ ఎన్నికల్లో తాము గెలిచిన విషయాన్ని ప్రత్యర్థి ప్యానెల్ సభ్యులు గుర్తించాలని అన్నారు. ‘మా’ అభివృద్ధి ప్రణాళికల్లో ప్రత్యర్థి ప్యానెల్ సహకారం కూడా తీసుకుంటామని తెలిపారు. ప్రత్యర్థి ప్యానెల్ రాజీనామా చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశం అమలు చేసేందుకు చిత్తశుద్ధితో శ్రమిస్తానని మంచు విష్ణు అన్నారు. ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.

 

Related posts

దమ్ముంటే పులివెందులలో గెలువు చూద్దాం:సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్!

Drukpadam

బీజేపీని వీడిన మాజీ మంత్రి చంద్రశేఖర్

Ram Narayana

పార్టీ మారుతున్నారన్న వార్తలపై ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్…

Drukpadam

Leave a Comment