Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈట‌ల రాజేంద‌ర్ కోస‌మే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది: కేటీఆర్!

ఈట‌ల రాజేంద‌ర్ కోస‌మే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది: కేటీఆర్!
ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఉన్నట్లే కనబడటం లేదు
హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు
జానారెడ్డినే ఓడించాం.. ఈట‌ల అంత‌కంటే పెద్ద నాయ‌కుడా?
ఈటలకు టీఆర్‌ఎస్ ఎక్క‌డ‌ అన్యాయం చేసింద‌న్న కేటీఆర్

హుజురాబాద్ ఎన్నికల కోసం రాష్ట్రమే కాదు దేశం యావత్తు ఆశక్తిగా ఎదురు చూస్తుంది. చూట్టానికి ఎన్నిక చిన్నదే కానీ ప్రభావం మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. ఒక చిన్న బై ఎలక్షన్ కోసం అధికారంలో ఉన్న టీఆర్ యస్ ప్రభుత్వం అడ్డదార్లు తొక్కుతుందని బీజేపీ ,కాంగ్రెస్ ల వాదన .తమ ప్రభుత్వం పేదలైన హరిజనులకోసం దళిత బందు తెచ్చి ప్రతికుటంబానికి లబ్ది చేకూరేలా చర్యలు చేపడితే ఆ పథకం డబ్బులు లబ్ది దార్లకు అందకుండా ఎన్నికల నిబంధనల పేరుతొ ఆపు చేయించిన ఘనత బీజేపీ దే ప్రత్యేకించి ఈటల రాజేందర్ దే నాని టీఆర్ యస్ ఆరోపిస్తుంది. దీనిపై టీఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ ,మంత్రి కేటీఆర్ స్పందన ఈ విధంగా ఉంది.

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ క‌చ్చితంగా గెలుస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేత‌ ఈట‌ల రాజేంద‌ర్ కోస‌మే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ డ‌మ్మీ అభ్య‌ర్థిని నిల‌బెట్టింద‌ని చెప్పుకొచ్చారు. ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఉన్నట్లే కనబడటం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆయ‌న ఆరోపించారు. ఈటల రాజేందర్‌కు టీఆర్‌ఎస్ ఎక్క‌డ‌ అన్యాయం చేసింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటి నుంచి ఈటల రాజేంద‌ర్ పదవుల్లో కొన‌సాగార‌ని చెప్పారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ద‌ళిత బంధును ప్ర‌వేశపెట్టింది ఈటల రాజీనామా చేసినందుకు కాద‌ని, ఈటల మంత్రి వ‌ర్గంలో ఉన్న స‌మ‌యంలోనే దళిత బంధుకు శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు.

తాము ఉప ఎన్నిక‌లో జానారెడ్డినే ఓడించామ‌ని, ఈట‌ల రాజేందర్ అంత‌కంటే పెద్ద నాయ‌కుడా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. బీజేపీ బుర‌ద‌ను ఈట‌ల అంటించుకున్నార‌ని ఆయ‌న దెప్పిపొడిచారు.

Related posts

రాజీవ్ ఖేల్ రత్న’ పేరు మార్చడంపై తీవ్రస్థాయిలో స్పందించిన రేవంత్ రెడ్డి!

Drukpadam

రాహుల్ గాంధీతో భేటీ అయిన ప్రశాంత్ కిశోర్…

Drukpadam

ప్రజలకు మరింత దగ్గర కావాలి …175 కు 175 సీట్లు మనవే … వర్క్ షాప్ లో సీఎం జగన్!

Drukpadam

Leave a Comment