Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలుగుదేశం ,వైసీపీ మధ్య యుద్ధం ..పట్టాభి వ్యాఖ్యల ఫలితం …

తెలుగుదేశం ,వైసీపీ మధ్య యుద్ధం ..పట్టాభి వ్యాఖ్యల ఫలితం …

.కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరిన చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ కార్యాలయం పై దాడి… లోకేష్ ఉగ్రరూపం …
ఎన్నాళ్లిలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడులు చేయిస్తావు
నువ్వే రా తేల్చుకుందాం!: నారా లోకేశ్ ఫైర్
రాష్ట్రంలో టీడీపీ నేతల ఇళ్లపై దాడులు
మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం ధ్వంసం
మండిపడిన లోకేశ్
“కోడికత్తిగా” అంటూ తీవ్ర వ్యాఖ్యలు

ఏపీలో టీడీపీ ,వైసీపీ లమధ్య యుద్ధం కొనసాగుతుంది. దీనిపై ప్రతిపక్ష నేత ,మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జోక్యాన్ని కోరారు. ఇందుకు కేంద్రం కూడా ఏపీ కి కేంద్ర బలగాలు పంపేందుకు అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మీడియా సమావేశంలో వైసీపీ నేతలపైనా ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్ పైన , సజ్జల రామకృష్ణరెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వాటిపై వైసీపీ మండి పడింది.దద్దమ్మ ,బోసిడికే ,తాడేపల్లి ప్యాలస్ లో ఉన్న పాలేరుగా అంటూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంపై వైసీపీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఫలితంగా రాజకీయ వాతావరణం కలుషితంగా మారింది. ఏపీలో జరుగుతున్నా చర్యలపై కేంద్రం నిశితంగా పరిశీలిస్తుంది.నిజంగా ఏపీ కి కేంద్రం టీడీపీ కోరిక మేరకు బలగాలను పంపుతుందా ? లేదా ? మాదక ద్రవ్యాలపై టీడీపీ చేస్తున్న వాదనలో ఎంతవరకు నిజముంది. వైసీపీ నేతల ప్రమేయం నిజంగా ఉందా? అనే విషయాలపై స్పష్టత రావాల్సిఉంది.

రాష్ట్రంలో టీడీపీ నేతల నివాసాలపై దాడులు, మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం ధ్వంసం ఘటనలపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఎన్నాళ్లు ఇలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడి చేయిస్తావు… నువ్వే రా తేల్చుకుందాం! అంటూ సవాల్ విసిరారు. “ఇప్పటివరకు ముఖ్యమంత్రి అని గౌరవించేవాడ్ని. నీ వికృత, క్రూర బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగ్గిస్ట్ జగన్ అని అంటున్నాను. నువ్వూ, నీ బినామీలు డ్రగ్స్ దందా చేస్తారు… ఆ విషయాలపై నిలదీసే టీడీపీ నేతలపై దాడులకు పాల్పడతావా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“నీ కార్యాలయాల విధ్వంసం మాకు నిమిషం పని. మా కార్యకర్తలు నీ ఫ్యాన్ రెక్కలు మడిచి, విరిచి నీ పెయిడ్ ఆర్టిస్టులను రాష్ట్రం దాటేంత వరకు తరిమికొడతారు” అంటూ హెచ్చరించారు.

“ఆనవాయితీలన్నింటిని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యానికి పాతరేసి, నీ సమాధికి నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు కోడికత్తిగా!” అంటూ ఘాటైన పదజాలం ఉపయోగించారు.

“తెలుగుదేశం సహనం చేతకానితనం అనుకుంటున్నావా? నీ పతనానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు. పరిపాలించమని ప్రజలు అధికారం అందిస్తే పోలీసుల అండతో మాఫియా సామ్రాజ్యం నడుపుతావా? టీడీపీ కేంద్ర కార్యాలయంపై గూండా మూకలతో దాడులకు తెగబడతావా?” అంటూ లోకేశ్ మండిపడ్డారు.

“నిన్ను ఉరికించి కొట్టడానికి టీడీపీ అధికారంలోకి రావాల్సిన పనిలేదు. నీ అరాచకాలపై ఆగ్రహంతో ఉన్న క్యాడర్ కు మా లీడర్ ఒక్క కనుసైగ చేస్తే చాలు” అంటూ స్పష్టం చేశారు.

Related posts

ఎన్నికల ముందు బీజేపీ శ్రీరామ జపం …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని ధ్వజం …

Ram Narayana

ఏపీలో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్ …బాదుడే బాదుడు తో చంద్రబాబు టూర్!

Drukpadam

కర్ణాటక నూతన సీఎం సిద్ధరామయ్యకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు…

Drukpadam

Leave a Comment