Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ పాపులారిటీ తగ్గిపోతుందా ?

కేసీఆర్ పాపులారిటీ తగ్గిపోతుందా ?
-దేశంలో ‘బెస్ట్ సీఎం’గా చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్
-రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఐఏఎన్ఎస్-సీఓటర్ సర్వే
-సెకండ్ బెస్ట్ సీఎంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
-కేసీఆర్ కు తగ్గుతున్న పాప్యులారిటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే బెస్ట్ సీఎం ల జాబితాలో ముందువరసలో ఉంటారు. అలాంటిది అయినా పాపులారిటీ తగ్గిపోతుందా అంటే అవుననే అంటున్నాయి సర్వేలు , మంచి మాటకారి అయినా మన ముఖ్యమంత్రి కి పాపులారిటీ ఎందుకు తగ్గుతుంది. కారణాలలు ఏమిటి అనే విషయం పై సర్వే సంస్థ మొత్తం 115 అంశాలపై సర్వే చేసింది.వాటి ఆధారంగా బెస్ట్ సీఎం ను ఐఏఎన్ఎస్-సీఓటర్ సర్వే సంస్థ ప్రకటించింది. అనూహ్యంగా కాంగ్రెస్ పాలిట రాష్ట్రానికి చెందిన చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భగేల్ బెస్ట్ సీఎంగా నిలిచారు. రెండవ బెస్ట్ సీఎంగా ఉత్తరాఖండ్ కు చెందిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ రెండో బెస్ట్ సీఎంగా నిలవడం విశేషం .అయినా సీఎం గా బాధ్యతలు చేపట్టి కొద్దికాలమే అవుతుంది.

దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భగేల్ నిలిచారు. ఐఏఎన్ఎస్-సీఓటర్ నిర్వహించిన సర్వేలో ఆయన బెస్ట్ సీఎంగా నిలిచారు. 94 శాతం మంది ఆయన పాలన పట్ల తృప్తిని వ్యక్తపరిచారు. మొత్తం 115 పరామితుల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వేను నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ… సీఈవో తరహాలో పాలిస్తున్న ముఖ్యమంత్రులనే ప్రజలు ఇష్టపడుతున్నారని చెప్పారు. సర్వేలో రెండో బెస్ట్ సీఎంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాప్యులారిటీ బాగా పడిపోతోందని యశ్వంత్ దేశ్ ముఖ్ తెలిపారు. కేసీఆర్ కు తగ్గుతున్న పాప్యులారిటీ… తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడానికి దోహదపడే అవకాశం ఉందని అన్నారు. 28.1 శాతం మంది ఉత్తరప్రదేశ్ సీఎం యోగిపై వ్యతిరేకతను వ్యక్తం చేశారని చెప్పారు. మిగతా రాష్ట్రాల సీఎం ల పైకూడా సర్వే నిర్వహించారు.

Related posts

బీఎస్పీ తెలంగాణ అధ్య‌క్షుడిగా ఆర్ఎస్ ప్ర‌వీణ్‌ కుమార్ నియామకం!

Drukpadam

ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకించాలంటూ కేసీఆర్‌ను కలిసిన అసద్…

Drukpadam

2024 లో కుప్పం లో భరత్, పలమనేరులో వెంకేటేష్ గౌడ్ వైసీపీ అభ్యర్థులు: పెద్దిరెడ్డి !

Drukpadam

Leave a Comment