Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నా టెంపర్ మెంట్ లూజ్ చేసుకోవడానికి ఒక్క సెకను చాలు: చంద్రబాబు!

నా టెంపర్ మెంట్ లూజ్ చేసుకోవడానికి ఒక్క సెకను చాలు: చంద్రబాబు!

-టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై వైసీపీ దాడులు

-వైసీపీపై చంద్రబాబు ఆగ్రహావేశాలు

-తనను దెబ్బతీయడం వైసీపీ నేతల వల్ల కాదని వ్యాఖ్యలు

-ఈ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపు

-రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయన్న చంద్రబాబురాష్ట్రపతి పాలనకు డిమాండ్

-ఆర్టికల్ 356 అమలు చేయాలని కోరిన చంద్రబాబు  

 

రాష్ట్రంలో టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియా సమావేశం నిర్వహించి నిప్పులు చెరిగారు. వైసీపీ దాడులకు నిరసనగా రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. హెరాయిన్ గురించి మాట్లాడితే ఏమిటి తప్పు? అని ప్రశ్నించారు. ఏపీలో గంజాయి సాగు గురించి పొరుగు రాష్ట్రాల డీజీపీలు చెప్పారని వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయి సాగు పెరిగిందని అనడమే టీడీపీ నేతలు చేసిన తప్పా అని నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇవాళ్టి దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు.

తమకు కూడా కోపం, ఆవేశం, బాధ, తపన ఉన్నాయని… అయితే నిగ్రహించుకుంటున్నామని స్పష్టం చేశారు. దాడి విషయం తమకు తెలియదని అంటున్న డీజీపీ ఆ పదవికి అర్హుడా అని ప్రశ్నించారు. “నేను ఫోన్ చేసినా డీజీపీ ఎత్తలేదు. గవర్నర్, కేంద్రమంత్రి ఫోన్ ఎత్తారు కానీ, డీజీపీ ఎత్తడా? ఏమనుకుంటున్నారు? ఎన్ని బాధలున్నా నిగ్రహించుకుంటున్నాం. నా టెంపర్ మెంట్ లూజ్ చేసుకోవడానికి ఒక్క సెకను చాలు. నా ఇంటి గేటుకు తాళ్లు కట్టినప్పటి నుంచి ఈ అరాచకాలు ప్రారంభం అయ్యాయి. రెండున్నరేళ్లుగా మీ దాడులు చూస్తున్నాం… నా మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు. కానీ అది మీ వల్ల కాదు. ఈ దాడులను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి” అని చంద్రబాబు పేర్కొన్నారు.

రేపు రాష్ట్ర బంద్ కు పిలుపు 

  • TDP Supremo Chandrababu calls for state bandh tomorrow

 చంద్రబాబు  రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. …. తాను సాధారణంగా బంద్ లకు పిలుపు ఇవ్వనని, కానీ నేడు జరిగిన ఘటనలతో బంద్ కు పిలుపు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని తెలిపారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఏనాడూ రాష్ట్రంలో 356 ఆర్టికల్ అమలు చేయాలని తమ పార్టీ గతంలో ఎప్పుడూ కోరలేదని, కానీ ఇవాళ్టి ఘటనల నేపథ్యంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముందో చెప్పాలని అన్నారు. గతంలో ఎక్కడైనా 356 ఆర్టికల్ అమలు చేసి ఉంటే, ఇంతకంటే బలమైన కారణాలు అక్కడ ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యంపైన జరిగిన దాడి కాదా? ప్రతి ఒక్క పార్టీ కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా అని విజ్ఞప్తి చేశారు.

 

Related posts

పెగాసస్ సృష్టికర్తలతో ఎలాంటి లావాదేవీలు జరపలేదు: పార్లమెంటులో స్పష్టం చేసిన కేంద్రం…

Drukpadam

అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు…

Drukpadam

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే: షర్మిల

Drukpadam

Leave a Comment