Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పవన్ కళ్యాణ్ , లోకేష్ చర్యలపై మంత్రులు బొత్స , అనికుమార్ లు మండిపాటు!

పవన్ కళ్యాణ్ , లోకేష్ చర్యలపై మంత్రులు బొత్స , అనికుమార్ లు మండిపాటు!
చంద్రబాబు పార్ట్‌న‌ర్ పవన్ క‌ల్యాణ్‌ సమర్థన సిగ్గుచేటున్న బొత్స
టీడీపీ నేత‌లు మాట్లాడుతోన్న అనుచిత వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాం
ప్రజాస్వామ్యంలో ఇటువంటి భాష స‌రికాదు
అటువంటి భాష‌ను స‌మ‌ర్థించేలా ప‌వ‌న్ వ్యాఖ్య‌లు
కేంద్రం నుంచి బ‌ల‌గాల‌ను పంపాల‌ని కోర‌డం ఏంటి
జగన్ ని తిట్టిస్తే ఊరుకుంటామా.. రా చూసుకుందాం: నారా లోకేశ్ కు మంత్రి అనిల్ కుమార్ సవాల్
మేము చేతికి గాజులు తొడుక్కోలేదు
చిత్తూరు జిల్లాలో పుట్టుంటే.. రా చూసుకుందాం
జగన్ ని తిట్టడం పవన్ కు తెలియదా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ బంద్ నిర్వ‌హిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై మంత్రులు బొత్స ,అనిల్ కుమార్ లు మండిపడ్డారు. వారు వేరువేరు గా మీడియా తో మాట్లాడుతూ నిన్న జరిగిన సంఘటనలపై వైసీపీ డే తప్పన్నట్లు పవన్ కళ్యాణ్ మాటాడటంపై బొత్స ఫైర్ అయ్యారు.నిన్న ప్రెస్ మీట్ లో టీడీపీ నేత పట్టాభి ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేసింది. ఆ తర్వాత పట్టాభి ఇంటితో పాటు రాష్ట్రంలోని పలు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన చంద్రబాబును ఆయన పార్టీని సమర్థించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.అసలు విషయం తెలుసుకోకుండానే వన్ సైడ్ మాట్లాడటం దారుణమన్నారు. ఇదేనా జనసేన విధానం అని నిలదీశారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడిన భాష గురించి చంద్రబాబు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

నెల్లూరు లో మీడియా తో మాట్లాడిన అనిల్ కుమార్ దమ్ముంటే చూసుకుందాం రా ? సీఎం జగన్ ను అంటే ఉరుకుంటామా ? మేమేమైనా చేతులకు గాజులు తొడుక్కున్నామా ? అంటూ మండి పడ్డారు. తాను వారంరోజులు నెల్లూరు లోనే ఉంటానని దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు .

ఈ నేప‌థ్యంలో ఆ పార్టీపై ఏపీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఆయ‌న విజ‌య‌న‌గ‌రంలో మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ నేత‌లు మాట్లాడుతోన్న అనుచిత వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నామ‌ని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి భాష స‌రికాద‌ని చెప్పుకొచ్చారు.

అటువంటి భాష‌ను స‌మ‌ర్థించేలా జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కేంద్రం నుంచి బ‌ల‌గాల‌ను పంపాల‌ని కోర‌డం ఏంట‌ని వ్యాఖ్యానించారు. ఓ వైపు బీజేపీతో మిత్ర‌త్వం కొన‌సాగిస్తున్నానంటూ.. మ‌రోవైపు చంద్రబాబు పార్టనర్ గా పవన్ క‌ల్యాణ్ టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌ను సమర్థిస్తుండ‌డం సిగ్గుచేటు అని ఆయ‌న అన్నారు.

టీడీపీ నేత‌ పట్టాభిరామ్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడి సమాధానం ఏంటని ఆయ‌న నిల‌దీశారు. సోము వీర్రాజు కూడా చంద్రబాబు నాయుడిని స‌మ‌ర్థిస్తూ మాట్లాడ‌డంలో ఆంతర్యమేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. టీడీపీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామ‌ని ఆయ‌న అన్నారు. టీడీపీ చర్యల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని బొత్స స‌త్యనారాయ‌ణ అన్నారు.

జగన్ ని తిట్టిస్తే ఊరుకుంటామా.. రా చూసుకుందాం: నారా లోకేశ్ కు మంత్రి అనిల్ కుమార్ సవాల్

మరోవైపు టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు పరుషపదజాలంతో విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ టీడీపీ నేత నారా లోకేశ్ కు సవాల్ విసిరారు. ‘దమ్ముంటే చూసుకుందాం రా’ అంటూ ఛాలెంజ్ చేశారు.

సీఎం జగన్ ని తిట్టిస్తే ఊరుకుంటామా? అని అనిల్ మండిపడ్డారు. తాము చేతికి గాజులు తొడుక్కోలేదని అన్నారు. మీరు చిత్తూరు జిల్లాలోనే పుట్టుంటే… రా చూసుకుందామని అన్నారు. తాను వారం రోజులు నెల్లూరులోనే ఉంటానని… ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. ఎవరొచ్చినా సరేనని… కాన్వాయ్ ని కూడా పక్కన పెట్టి వస్తానని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్ ను దారుణంగా తిట్టిన విషయం జనసేనాని పవన్ కల్యాణ్ కు తెలియదా? అని ప్రశ్నించారు. జగన్ ఫ్యాక్షనిస్ట్ అయితే మీరు ఉండగలరా? అని అడిగారు. వైసీపీ కార్యకర్తలను ఎవరు తాకినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Related posts

కాంగ్రెస్-శివసేన బంధానికి బ్రేక్ లు పడతాయా ?

Drukpadam

బుద్ధా వెంకన్నఅరెస్ట్…చంద్రబాబు ఖండన ….

Drukpadam

నేడే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోంలో అసెంబ్లీ ఎన్నికలు…

Drukpadam

Leave a Comment