Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇదేమి ప్రతిపక్షం …ఇదెక్కడి భాష …ఇల్లేమి నాయకులు:సీఎం జ‌గ‌న్!

ఇదేమి ప్రతిపక్షంఇదెక్కడి భాషఇల్లేమి నాయకులు:సీఎం జ‌గ‌న్!
ప‌రుష ప‌ద‌జాలం.. దారుణ‌మైన భాష మాట్లాడుతున్నారు
నేను ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఇలా మాట్లాడ‌లేదు
ఏపీలో సంక్షేమ పాలనను టీడీపీ ఓర్వలేకపోతోంది
ఎవరూ మాట్లాడని బూతులు మాట్లాడుతున్నారు
టీడీపీ అసహనం తో వ్యవహరిస్తోంది
కావాలనే రెచ్చెగొడుతున్నారు

ఇదేమి ప్రతిపక్షం …ఇదెక్కడి భాష …ఇల్లేమి నాయకులు అంటూ టీడీపీ నేతలపై ఏపీ సీఎం జ‌గ‌న్ మండిపడ్డారు … పోటీ ఉండాలి …కానీ తిట్లలో కాదు …. మా విధానాలపై మాట్లాడితే మంచిదే …మేము చేసే పథకాలు మంచివి కావని లేదా అందులో అవినీతి జరుగుతుందని చెప్పటంలో తప్పులేదు…ఒకవేళ నిజంగా తప్పులు ఉంటె సరి చేసుకోవాల్సిందే …రాష్ట్రంలో ప్రతిపక్షం కేవలం అధికారం పోయిందన్న దుగ్దతో మాట్లాడటం దారుణం …ఇలాంటి ప్రతిపక్షం దేశంలో ఎక్కడ లేదు. ఇది విచారకరం … అని జగన్ అన్నారు. . ‘జగనన్న తోడు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొంద‌రు ప‌రుష ప‌ద‌జాలం వాడుతున్నార‌ని, దారుణ‌మైన భాష మాట్లాడుతున్నారని ఆయ‌న అన్నారు. తాను ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఎన్న‌డూ ఇలా మాట్లాడ‌లేద‌ని పేర్కొన్నారు .

తాము ఏపీలో అందిస్తోన్న‌ సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. తాము ఏపీలో సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి రాష్ట్రంలో కుల, మత, ప్రాంతం, పార్టీలతో నిమిత్తం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

దీంతో ప్రతిపక్షం ఎలా తయారయిందో ఏపీ ప్రజలే గ‌మ‌నిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఎవరూ మాట్లాడని బూతులను ప్రతిపక్షం మాట్లాడుతోందని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు కావాలనే వైషమ్యాలు సృష్టించి రెచ్చగొడుతున్నారని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌తిప‌క్ష నేత‌లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోప‌ణ‌లు గుప్పించారు.

వారి ప్రతిమాటలోనూ వంచన కనిపిస్తోందని, మత విద్వేషాలను సైతం రెచ్చగొట్టేందుకు టీడీపీ వెనకాడదని అన్నారు. కావాల‌నే తిట్టించి రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని జ‌గ‌న్ చెప్పారు.
తాను ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లారా చూశానని, ఇప్పుడు వారికి సాయం చేస్తున్నామ‌ని తెలిపారు.

వారికి ‘జగనన్న తోడు’ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నామ‌ని తెలిపారు. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.905 కోట్లు పంపిణీ చేశామ‌ని ఆయ‌న వివ‌రించారు. ఏడాదిలో రెండుసార్లు ‘జగనన్న తోడు’ కార్యక్రమం ఉంటుంద‌ని చెప్పారు.

Related posts

ఆఫ్ఘన్ భూభాగం ఉగ్రవాదుల అడ్డా కాకూడదు: భారత్!

Drukpadam

కుటుంబ సభ్యుల కోసమే కేసీఆర్ అంతరాత్మ పనిచేస్తుంది: కిషన్ రెడ్డి

Drukpadam

కర్నూలులో చంద్రబాబు ఆవేశం చూసి బాధేసింది: యనమల!

Drukpadam

Leave a Comment