తెలంగాణాలో రెడ్లను కేసీఆర్ మోసం చేశారా ?
-రెడ్ల సంఘం షర్మిలకు మద్దతు ప్రభావం ఎంత ?
-షర్మిల పార్టీలో రెడ్లకు ప్రాధాన్యత ఉంటుందా ?
———//———–////———–////———–///—–
తెలంగాణాలో రెడ్లను కేసీఆర్ మోసంచేశాడా ?వారికీ రాజకీయంగా ప్రాధాన్యత లేదని మదన పడుతున్నారా ? అందుకే షర్మిల పెడుతున్న కొత్త పార్టీకి మద్దతు ప్రకటించేందుకు సిద్దమయ్యారా? దీనివల్ల రెడ్లకు ఉపయోగం జరుగుతుందా ? రెడ్ల మద్దతు వల్ల షర్మిల పార్టీకి లాభం ఉంటుందా ? ఆమె రెడ్లకు ప్రాధాన్యత ఇస్తారా? అనే చర్చకు రెడ్ల సంఘమే తెరలేపింది.ఉమ్మడి రాష్ట్రంలో రెడ్లదే అధికారం . ఎన్టీఆర్ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చే వరకు మద్యమద్యలో ఇతర కులాల వారు వచ్చిన ఒక్క వెంగళరావు తప్ప రాష్ట్రాన్ని పూర్తికాలం పరిపాలించిన రెడ్డి యేతర ముఖ్యమంత్రి లేరు. కేంద్రంలో ఉన్నా కాంగ్రెస్ సీల్డ్ కవర్ల సంస్కృతీ రాష్ట్రంలో కాంగ్రెస్ ను ప్రజల్లో దిగజార్చింది. ఎవరు వచ్చిన వారిపై ఫిర్యాదుల వెల్లువ వారిని దించే వరకు వెంటబడటం జరిగేది. ఎన్టీఆర్ ఒక ప్రభంజనం సృష్టించారు. అప్పటినుంచే రెడ్లకు క్రమంగా ప్రాధాన్యత తగ్గింది.ఇక చంద్రబాబు పూర్తిగా ఇస్మరించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కు జీవం పోశారు. ఆయన జరిపిన పాదయాత్ర వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ ను బ్రతికించింది. తెలంగాణ ఏర్పాటు తరువాత వారికి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఒకప్పుడు శాసించేవారు ఇప్పుడు యాచించే స్థాయిలోకి నెట్టి వేయబడ్డారు. ఇది చరిత్ర . చరిత్రలో ఎప్పుడు ఒక కులమే రాజ్యం వెళ్లిన సందర్భం లేదు. అందువల్ల మార్పులు సహజం . ఇప్పుడు తెలంగాలో రాజ్యాధికారం కోసం యుద్ధం జరుగుతుంది. దీనిలో రెడ్లు ఎటు వైపు అనేది చర్చగానే ఉంది. ఇప్పటికి రెండు రాష్ట్రాలలో రెడ్లు నిర్ణయాత్మక శక్తిగానే ఉన్నారు. 60 నుంచి 90 అసెంబ్లీ సీట్లవరకు వారే గెలుస్తుంటారు. నియోజకవర్గాలలో వారు కొద్దిగా ఉన్నా ఓటర్లపై ప్రభావం చూపించేశక్తి వారిది . అందువల్ల రాష్ట్ర రాజకీయాలను శాసించేవారు. 2014 నుంచి 2019 వరకు ఏపీ లో జగన్ అధికారంలోకి వచ్చేంతవరకు రెడ్ల రాజ్యం లేదనే ఫీలింగు వారిలో ఉంది. దీనితో అనేక సందర్భాలలో మధన పడ్డారు. అధికారం కోసం ఆలోచనలు చేస్తున్నారు. అందుకే కేసీఆర్ రెడ్లను మోసం చేశారని రెడ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నవల్ల సత్యనారాయణ రెడ్డి తెలంగాణాలో షర్మిల పెట్టబోయే కొత్త పార్టీకి మద్దతు ఇస్తునట్లు ప్రకటించారు. కేసీఆర్ వచ్చిన తరువాత రెడ్లకు ప్రాధాన్యత తగ్గిందనేది రెడ్ల సంఘం అభిప్రాయం పడుతుంది. ఇదే విధంగా మిగతా కులాలు కూడా అభిప్రాయం పడుతున్నాయి. కేసీఆర్ యలమ కులం వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు ఉన్నాయి. అంతే కాదు కేసీఆర్ పాలనలో తన కుటుంబానికే ప్రాధాన్యత ఉందనే విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. ఇక రెడ్ల సంఘం నేత ప్రకటన రెడ్ల అంగీకారం తో జరిగిందా ? అందరు అయన నిర్ణయాన్ని శిరసావహిస్తారా అంటే అంతా తేలిక కాదు . ఇప్పటికే వివిధ పార్టీలలో వివిధ స్థాయిలలో రెడ్లు ఉన్నారు. వారంతా గంప గుత్తగా షర్మిల వెంట నడుస్తారా ? ఆమెకు మద్దతు పలుకుతారా ? అంటే అనుమానమే ?అయితే సత్యనారాయణ రెడ్డి బహిరంగ ప్రకటన షర్మిలకు మేలు ఎంత చేస్తుందో ఎంత శాతం రెడ్లు ఆమెకు మద్దతు ప్రకటిస్తారనేది చూడాల్సిందే !!!