Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఈటల డబ్బులు పంచుతున్నారు టీఆర్ యస్ గగ్గోలు …ఈసీకి ఫిర్యాదు…

ఈటల డబ్బులు పంచుతున్నారు టీఆర్ యస్ గగ్గోలు …ఈసీకి ఫిర్యాదు…
ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు
హుజూరాబాద్ ఉపఎన్నికకు దగ్గర పడుతున్న సమయం
ప్రచారాన్ని ఉద్ధృతం చేసిన రాజకీయ పార్టీలు
ఈటలపై ఇప్పటికే పలుమార్లు ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్

ఓటర్లకు ఈటల డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్ యస్ గగ్గోలు పెడుతుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. డబ్బులు పంచేందుకు కొత్త మార్గాలను ఈటల ఎంచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నది . నియోజకవర్గంలో మాత్రం టీఆర్ యస్ , బీజేపీ పోటాపోటీగా వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుతున్నారు.అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ కూడా టీఆర్ యస్ ప్రలోభాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. పరస్పర విమర్శలు ,ఆరోపణలతో నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థిలు నెలకొన్నాయి. ముఖ్యనేతలను గ్రామాలలో ప్రభావం చూపగలిగే వ్యక్తులను సెక్షన్ లను ఎంచుకొని వారిని తమవైపుకు తిప్పుకునేందుకు అన్ని అడ్డదార్లను వెతుకుంటున్నారు. దళిత బందు ఆపడంపై ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దళిత బందు పథకం అప్పడంపై బీజేపీ నే కారణమని టీఆర్ యస్ విమర్శలు చేస్తుండగా , ఆధారాలు చూపాలని బీజేపీ సవాల్ విసురుతుంది.

హుజూరాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతోంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు పలుమార్లు ఈసీకి ఫిర్యాదు చేశారు. తాజాగా వారు మరోసారి ఈసీ తలుపు తట్టారు. హుజూరాబాద్ లో ఓటర్లకు డబ్బు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ కు ఫిర్యాదు చేశారు.

కొత్త బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈటలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని… ఇప్పటికైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఈసీని కలిసిన వారిలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్, టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు ఉన్నారు.

Related posts

పాకిస్థాన్ లో పోలీస్ స్టేషన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు!

Drukpadam

సర్వమతసమ్మేళనానికి ప్రతీక ఖమ్మం..గణేష్ నిమజ్జనోత్సవాల్లో మంత్రి పువ్వాడ అజయ్…

Drukpadam

తప్పుటడుగులే…మా కొంప ముంచాయి … శ్రీలంక అధ్యక్షడు!

Drukpadam

Leave a Comment