Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

షర్మిల వద్దకు వై వీ సుబ్బారెడ్డి రాయబారం…

పాదయాత్రలో ప్రత్యక్షమైన వైవీ సుబ్బారెడ్డి

కాగా- వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రలో ఓ అనూహ్య అతిథి కనిపించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ పాదయాత్రలో కనిపించారు. వైవీ సుబ్బారెడ్డి.. స్వయానా వైఎస్ షర్మిలకు బాబాయ్. ఈ ఉదయం ఆయన అమరావతి నుంచి కొత్తగూడకు చేరుకున్నారు. వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు వారిద్దరి మధ్య ఈ భేటీ కొనసాగింది.

26 సమన్వయ కమిటీలు..

పాదయాత్ర ముగిసిన అనంతరం పార్టీ నేతలతో సమావేశమౌతారు. ఆ రోజు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతుల గురించి చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో ఒక నోట్‌ను తయారు చేస్తారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేస్తారు. పాదయాత్రను విజయవంతం చేయడానికి వైఎస్సార్‌టీపీ అగ్ర నాయకత్వం కోఆర్డినేషన్ కమిటీలను కూడా నియమించింది. మొత్తంగా 26 సమన్వయ కమిటీలు వైఎస్ షర్మిల పాదయాత్ర కోసం పని చేస్తోన్నాయి.

వైఎస్ షర్మిల అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దూతగా వైవీ సుబ్బారెడ్డి పాదయాత్రకు వచ్చినట్లు తెలుస్తోంది.

పాదయాత్ర మొదలు పెట్టి అయిదవ రోజుకు చేరుకున్నందున.. తన తోబుట్టువు ఆరోగ్య పరిస్థితి, క్షేమ సమాచారాలను తెలుసుకోవడానికి వైఎస్ జగన్.. తన బాబాయ్, అత్యంత విశ్వసనీయుడిగా పేరున్న వైవీ సుబ్బారెడ్డిని పంపించినట్లు చెబుతున్నారు. పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు.. ఈ అయిదు రోజుల్లో వచ్చిన ప్రజల స్పందన గురించి ఆరా తీశారని చెబుతున్నారు. పాదయాత్ర కొనసాగింపు విషయంపైనా వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

సాయంత్రం వైఎస్ విజయమ్మతో భేటీ..

కాగా- ఈ సాయంత్రం వైవీ సుబ్బారెడ్డి.. వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మను కలుస్తారని సమాచారం. వైఎస్ షర్మిలను కలుసుకున్న అనంతరం వైవీ సుబ్బారెడ్డి నేరుగా లోటస్ పాండ్ నివాసానికి వెళ్తారని, అక్కడ విజయమ్మతో భేటీ అవుతారని చెబుతున్నారు. వైఎస్ జగన్.. అందజేసిన సమాచారంపై విజయమ్మతో చర్చిస్తారని, ఆ తరువాత ఓ నిర్ణయానికి వస్తారని అంటున్నారు. దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది వైఎస్ విజయమ్మ మీదే ఆధారపడి ఉంటుందని సమాచారం.

Related posts

వైసీపీలో జయప్రకాశ్ నారాయణ చేరబోతున్నారా? లోక్ సత్తా స్పందన ఏమిటి?

Ram Narayana

The Art of Photography as Therapy for Your Clients

Drukpadam

ఆర్కే మృతిపై కచ్చితమైన సమాచారం ఏది లేదు …ప్రొఫెసర్ హరగోపాల్…

Drukpadam

Leave a Comment