Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గులాబీ దళపతిగా పదవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్!

గులాబీ దళపతిగా పదవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్!
-27 ఏప్రిల్ 2001న కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఆవిర్భావం
-అప్పటి నుంచి వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికవుతున్న కేసీఆర్
-దేశంలో సుదీర్ఘకాలంపాటు పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తుల్లో ఒకరిగా రికార్డుల్లోకి
-టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్
-కేసీఆర్ ఎన్నికను ప్రకటించిన కె.కేశవరావు
-అందరికీ ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్

గులాబీ దళపతిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 వసారి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. పార్టీ పెట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు గత 20 సంవత్సరాలుగా టీఆర్ యస్ కు అధ్యక్షుడిగా ఎన్నికవుతూ రికార్డు సృష్టించారు. ఉద్యమకాలంలో 13 సంవత్సరాలు , అనంతరం రాష్ట్ర ఏర్పడి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గత 7 సంవత్సరాలుగా ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఈసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సమర్థవంతంగా భాద్యతలు నిర్వహిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ తారక తారక రామారావు ను పార్టీ అధ్యక్షడిగా చేసి తరువాత సీఎం గా చేసే అవకాశం ఉండనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ తిరిగి కేసీఆర్ నే అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సీనియర్ నేత కేశవరావు ప్రకటించగానే సభాస్థలం కేసీఆర్ నినాదాలతో మారుమోగింది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన వరుసగా 10 వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ఎన్నికను పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ విజయాన్ని పార్టీ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు అధికారికంగా ప్రకటించారు.

అంతకు ముందు ప్లీనరీ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తనను పార్టీ అధినేతగా ఎన్నుకున్నందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా ప్లీనరీని నిర్వహిస్తున్నారు. ఈ ప్లీనరీకి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ప్లీనరీలో ప్రస్తుతం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు.

27 ఏప్రిల్ 2001న కేసీఆర్ అధ్యక్షుడిగా 12 మంది ప్రతినిధులతో టీఆర్ఎస్ పురుడుపోసుకుంది. ఆ తర్వాత వరుసగా జరిగిన ప్లీనరీల్లో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వచ్చారు. నేడు జరగనున్న ప్లీనరీ పదోది కాగా, ఈసారి కూడా పార్టీ నేతలు ఆయననే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం . ఫలితంగా సుదీర్ఘకాలంపాటు ఓ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్న వారి జాబితాలో కేసీఆర్ కూడా చేరనున్నారు.

Related posts

కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్!

Drukpadam

సాగర్ ఉపఎన్నిక – పట్ట భద్రుల ఎన్నిక కోసం పార్టీల ఎత్తులు

Drukpadam

‘అమరుడి కొడుకును అవమానించినా కేసులేదు’: ప్రియాంక గాంధీ

Drukpadam

Leave a Comment