Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ లో కమలానికి కష్టాలేనా …?

ఏపీ లో కమలానికి కష్టాలేనా …?
-విశాఖ స్టీల్ ప్లాంట్ పై నీళ్లు నములు తున్న నేతలు
– ప్రత్యేక హోదా విషయంలో ప్రజల నుంచి తప్పించుకోగలదా ?
ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుదామని భావిస్తున్న కమలానికి కష్టాలు తప్పటం లేదు. ఇటు వైసిపి ని అటు తెలుగుదేశాన్ని వ్యూహాత్మకంగా దెబ్బగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న కమలనాధులు ఎదురు దెబ్బలు తగులు తున్నాయా?అంటే అవుననే సమాధానమే వస్తుంది. రాష్ట్రము పై కేంద్రంలో ఉన్న బీజేపీ కి చిన్నచూపు ఉందనే భావన ఉందా ? విశాఖ స్టీల్ ప్లాంట్ , ప్రత్యేక హోదాలు ఆపార్టీ కి గుదిబండలుగా మరియా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు . విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ నీళ్లు నములుతుంది. ఇక మిత్ర పక్షంగా ఉన్న జనసేన ఏమి చెప్పాలి అర్థంకాక తలలు పట్టుకుంటుంది.
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలలో అధికారంలోకి రాకపోయినా కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలని కలలు కంటున్న పార్టీ .అందుకు అనుగుణంగా రాష్ట్రంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉండటం , ఏపీలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం బలహీనపడటంతో తమకు అవకాశాలు ఉంటాయని పెద్ద ఆశతో ఉన్నది. గతంలో తెలుగు దేశంలో ,కాంగ్రెస్ లో ఉన్న కొందరు ముఖ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇంకేముంది తమపార్టీలోకి వలసలు పెరిగినందున రానున్న కాలం తమదేనని తెలుగుదేశం స్థానంలో తామే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించబోతున్నామని సంబరపడ్డారు. దానికి తగ్గట్లుగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కూడా తమకు స్నేహ హస్తం అందివ్వటం తో వారి అంచనాలు పెరిగాయి. పవన్ కళ్యాణ్ పార్టీ తమకు మిత్ర పక్షమైనందున తమదే అధికారం అనేరీతిలో వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన తిరుపతి లోకసభ సభ్యుడు బల్లి దుర్గ ప్రసాద్ ఆకస్మికంగా మరణించటంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఆస్థానం నుంచి పోటీచేయటం ద్వారా తమ సత్తా చాటాలని మంచి పధకాలు రచిస్తున్నారు. అయితే వారి ఆశలు అంత తేలిగ్గా నెరవేరేలాలేవు . అందుకు రెండు కారణాలు ఉన్నాయి .ఒకటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన వాగ్దానం వారు మర్చిపోయిన ప్రజలు మర్చిపోలేదు . ప్రజలు మరిచిపోయారని భ్రమల్లో వారు ఉన్నారు. రెండు విశాఖ పట్టణం లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ ని ప్రవేట్ పరం చేయాలనీ కేంద్రం నిర్ణయించటం . ఇప్పటికే బీజేపీ ,వారి పార్ట్నర్ అయినా జనసేనలు మినహా మిగతా అన్ని పార్టీలు దీనిపై ఆందోళన బాట పట్టాయి. జనసేన ముందు స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది . దీనిపై పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ నాయకులను కలిశారు. అప్పటినుంచి దానిపై మాట్లాడటం మానేశారు. అక్కడికి వెళ్లి వారి ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలనే ఆలోచన చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో ఆయన అక్కడికి వెళ్ళలేదు. దీంతో ఆయన వైఖరిపై సందేహాలు కలుగుతున్నాయని మాటలు వినిపిస్తున్నాయి.
బీజేపీ నాయకులూ రాష్ట్ర అధ్యక్షలు సోమువీర్రాజు నాయకత్వంలో ఒక బృందం ఢిల్లీకి వెళ్లి తమ నాయకులను కేంద్ర మంత్రులను కలిసింది. స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్నా ఆందోళనలు దాని చరిత్ర గురించి కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రికి వివరించారు.వారు ఏమి వివరించారు.కేంద్రం ఏమి చెప్పింది అనేది స్పష్టత లేదు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎవరు ఆందోళనలు చేయవద్దని చెబుతున్నారు. ఉద్యోగులకు , నష్ట జరిగే పని కేంద్రం చేయదని అంటున్నారు.అక్కడ ప్రజల అభీష్టం మేరకే నడుచుకుంటుందని అంటున్నారు. అయితే ప్రవేటీ కరణ చేయదని కేంద్రం చేత హామీ ఇప్పించగలరా ? అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న . ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్ ను కనీసం గనులు కేటాయించకుండా నష్టాల బాటలో ఉందనే సాకుతో ప్రవేటీకరించటం పై ఒక్క విశాఖ వాసులే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కేంద్రంపై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిందని అపవాదు బీజేపీ మీద ఉంది. అసలే విడిపోయిన రాష్ట్రానికి సహాయం చేయడంలేదని బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు లేవని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. బీజేపీ నాయకులూ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం అంటూనే గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రతిష్టాత్మక స్టీల్ ఫ్యాక్టరీ పై ద్వంద విధానాలు అవలంబిస్తే తగిన మూల్యం చెల్లిచుకోక తప్పదనే అభిప్రాయాలే ఉన్నాయి. బీజేపీ ఎలాంటి ఎత్తులు వేస్తుంది. వాటికీ ప్రజల నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది అనేది చూడాలి మరి !!!

Related posts

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు

Drukpadam

రాజుకుంటున్న యూ పీ ఎన్నికల వేడి …

Drukpadam

చెప్పులు చూపించకూడదయ్యా పవన్ కల్యాణ్….అంబటి రాంబాబు

Drukpadam

Leave a Comment