Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దళితబందు దద్దరిల్లింది …ఏపీ లో కూడా పార్టీ పెట్టమంటున్నారు : కేసీఆర్!

దళితబందు దద్దరిల్లింది …ఏపీ లో కూడా పార్టీ పెట్టమంటున్నారు : కేసీఆర్!
-పక్కరాష్ట్రాల్లో పార్టీ పెట్టాలనే డిమాండ్ వస్తుంది.
-నాందేడ్ ,రాయచూర్ లను తెలంగాణ లో కలపాలనే డిమాండ్స్ వస్తున్నాయి
-అభివృద్ధి మంత్రం …సంక్షేమ తంత్రం
-దళితబంధు పెట్టిన తర్వాత ఏపీ నుంచి వేలాది విన్నపాలు వస్తున్నాయి
-మన పథకాలను చూసి పక్క రాష్ట్ర సీఎంలు ఆశ్చర్యపోతున్నారు
-అభివృద్ధిలో నెంబర్ వన్ తెలంగాణ
-అన్ని రాష్ట్రాల మన అభివృద్ధిపై ఆరా తీస్తున్నాయి.
-ఇంత అభివృద్ధి ఎలా సాధ్యం అని అడుగుతున్నాయి.
-నవంబర్ 4 తర్వాత దళితబంధును ఎవరూ ఆపలేరు

దళితబందు దద్దరిల్లింది…తెలంగాణ అభివృద్ధి సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలిచింది.దీంతో పక్కరాష్ట్రమైన ఆంధ్రానుంచి మారాష్ట్రంలో పార్టీ పెట్టండి మేము గెలిపించుకుంటాం అని అంటున్నారు అక్కడి ప్రజలు ….అని కేసీఆర్ అన్నారు. హైద్రాబాద్ లో జరుగుతున్న పార్టీ ప్లినరీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పరిణామాలను ప్రతినిధుల హర్షద్వానాల మధ్య వివరించారు. మన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి దేశంలోని అనేక రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని అన్నారు. కర్ణాటక లోని రాయచూర్ ఎమ్మెల్యే తమ జిల్లాను తెలంగాణ లో కలపండి అని ఆరాష్ట్ర మంత్రి పాల్గొన్న వేదిక మీదనే అడిగారని అదే విధంగా మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి కూడా ఇలాంటి డిమాండ్ ఉందని అన్నారు.

దళితబంధును ఆపేది నవంబర్ 4 వరకేనని… ఆ తర్వాత ఆ పథకాన్ని ఎవరూ ఆపలేరని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. డిసెంబర్ నాటికి హూజూరాబాద్ లో దళితబంధులను వంద శాతం అమలు చేస్తామని చెప్పారు. దళితబంధు పెట్టిన తర్వాత ఏపీ నుంచి వేలాది విన్నపాలు వస్తున్నాయని… ఆంధ్రలో కూడా పార్టీని పెట్టండి, గెలిపించుకుంటామని అంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు కావాలని ఆంధ్ర ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ఉత్తరాంధ్రకు చెందిన వేలాది మంది కూలీలు తెలంగాణకు వచ్చి పని చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ప్లీనరీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలనే డిమాండ్లు పక్క రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. నాందేడ్, రాయచూర్ జిల్లాల నుంచి ఈ డిమాండ్లు వచ్చాయని తెలిపారు. మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. దేశ విదేశాల్లో కూడా తెలంగాణ ప్రతిష్ఠ ఇనుమడిస్తోందని అన్నారు. సాహసం లేకపోతే దేన్నీ సాధించలేమని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించాలని, కేసీఆర్ సభ పెట్టకూడదనే చిల్లర ప్రయత్నాలను మానుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ప్లీనరీలో చేస్తున్న ప్రసంగాన్ని హుజూరాబాద్ ప్రజలంతా చూస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేస్తుందని తెలిపారు.

 

 

Related posts

టీఆర్ యస్ ,బీజేపీ డ్రామాలతో రాష్ట్రానికి దక్కకుండా పోయిన ఆయుష్ వైద్య కేంద్రం…ఆరెస్పీ!

Drukpadam

ఈయన పెద్ద దానకర్ణుడిలా మాట్లాడుతున్నాడు: సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

Ram Narayana

కేంద్రంపై కేసీఆర్ యుద్ధానికి వెళ్లినందుకు సంతోషం: భట్టి

Drukpadam

Leave a Comment