Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్రబాబు కు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఫోన్ …

చంద్రబాబు కు కేంద్ర హోమ్  మంత్రి  అమిత్ షా ఫోన్ …

కేంద్రం దోబుచులాట …జగన్ సర్కార్ ను ఇరుకున పెట్టె ప్రయత్నమా!
-చంద్రబాబు నుంచి వివరాలను అడిగి తెలుసుకున్న అమిత్ షా
-ఢిల్లీ పర్యటనలో అమిత్ షాను కలవలేకపోయిన చంద్రబాబు
-జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి
-ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల కలవలేకపోయానన్న అమిత్ షా

 

చంద్రబాబు కు కేంద్ర హోమ్ మంత్రి ఫోన్   కేంద్రం ఏపీ విషయంలో దోబుచులాడుతుందా ?. ప్రత్యేకించి జగన్ సర్కార్ ను ఇరుకున పెట్టె ప్రయత్నాలను చేస్తుందా ? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఏపీ లో జరిగిన ఘటనలు నేపథ్యంలో చంద్రబాబు దీక్ష ,అనంతరం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవడం విదితమే . ఆ సందర్భంగానే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా , ప్రధాని మోడీ ని కలవాలని ప్రయత్నించారు. కానీ అక్కడ వారి ఆపాయిట్మెంట్ దొరకలేదు. దీంతో చంద్రబాబు తిరిగి ఏపీ కి చేరుకున్నారు . దీనిపై రకరకాల ప్రచారం జరిగింది. కావాలనే చంద్రబాబు కు ఆపాయిట్మెంట్ ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. కానీ రెండు రోజుల తరువాత అమిత్ షా చంద్రబాబు కు ఫోన్ చేశారు. బాబు ఆపాయిట్మెంట్ కు కారణం తెలుసుకున్నారు. కావలేకపోయిన కారణం చంద్రబాబు కు అమిత్ షా తెలిపారు. ఏపీ లో జరుగుతున్నా పరిణామాలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి గురించి వివరించారు. టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని వీడియో లతో సహా పంపుతామని రాష్ట్రంలో ఆర్టికల్ 356 ను ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు . అమిత్ షా చంద్రబాబు కు ఫోన్ చేయడంతో టీడీపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ , గంజాయి అంశాలపై పై తాము చేస్తున్న పోరాటాన్ని చంద్రబాబు అమిత్ షా కు వివరించారు.

ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేశారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల తాను కలవలేకపోయానని… త్వరలో కలుద్దామని చంద్రబాబుకు ఆయన తెలిపారు. తనను ఎందుకు కలవాలనుకున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీ పరిస్థితులపై నివేదికను తయారు చేశామని, దాన్ని పంపుతామని అమిత్ షాకు ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.

ఇదే సమయంలో టీడీపీ కార్యాలయాలపై దాడులు, గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా తదితర అంశాలతో పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాల్సిన ఆవశ్యకతను హోంమంత్రికి వివరించారు. పూర్తి సమాచారాన్ని వీడియోలతో పాటు పంపుతానని… తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు నుంచి వివరాలు తెలుసుకున్న అమిత్ షా త్వరలో కలుసుకుందామని చంద్రబాబు కు చెప్పారని టీడీపీ వర్గాల బోగట్టా … అమిత్ షా చంద్రబాబు కు ఫోన్ చేయడంపై వైసీపీ వర్గాలు అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే చంద్రబాబు కు అమిత్ షా ఫోన్ చేయడంపై బీజేపీ మరోలా స్పందించింది. ఇది సాధారణంగా జరిగేదేనని సీనియర్ పొలిటికల్ నాయకుడైన చంద్రబాబు అమిత్ షా ఆపాయిట్మెంట్ అడిగారని అయితే ఆరోజు కలవడం కుదరనందున ఫోన్ చేసి వివరాలు తెలుసున్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

Related posts

యూపీలో అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్..యూ పీ పోలిసుల మీద నమ్మకం లేదన్న అఖిలేశ్ -అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం…

Drukpadam

నష్ట నివారణకు ఇదే చివరి అవకాశం.. సోనియాకు 13 పాయింట్లతో సిద్ధూ లేఖ…

Drukpadam

శివసేనలో ముసలం.. అత్యవసర సమావేశానికి ఉద్ధవ్ థాకరే పిలుపు!

Drukpadam

Leave a Comment