Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వామ్మా బాబోయ్ ఇంతమంది పోలీసులా? ఇది ఎన్నికనా?? యుద్దమా ???

వామ్మా బాబోయ్ ఇంతమంది పోలీసులా? ఇది ఎన్నికనా?? యుద్దమా ???
హుజురాబాద్ .బద్వేల్ లలో ముగిసిన ప్రచారం …పోలీస్ వలయంలో పోలింగ్
-బయట నుంచి వచ్చిన వారిని నియోజకవర్గం విడిచి వెళ్లి పోవాలని ఆదేశాలు
-కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు …అడుగడుగునా పోలీసులే
-ప్రచారం ముగిసింది. మైకుల గోల తగ్గింది…చివర ప్రలోభాలు ప్రారంభం
-రాష్ట్రనుంచి 1400 పోలీసులు … ఇవి గాక కేంద్ర భద్రతా బలగాలు

రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు నియోజకవర్గాలలో శాసనసభ కు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలలో విపరీతంగా పోలీసులు మోహరించడంతో వామ్మా బాబోయ్ ఇంత మంది పోలీసులా అనే ఆశ్చర్యాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణలోని హుజురాబాద్ ఎన్నిక 20 ,20 మ్యాచ్ ని తలపిస్తుంది. ఇక్కడ అధికార పార్టీ కి చెందిన కీలక మంత్రి ఉద్యమకారుడు , ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ భూకబ్జా ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి తప్పించారు. దీంతో మనస్తాపానికి గురైన ఈటల బీజేపీ లో చేరి ఎమ్మెల్యే పదవికూడా రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యం అయింది. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. గత మూడు నెలలుగా ఇక్కడ హోరాహోరీగా జరుగుతున్న ప్రచారం ముగియడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఇక్కడ ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన మంత్రులు ,ఎమ్మెల్యే లు , ఎమ్మెల్సీలు , ఇతర నాయకులూ తట్టాబుట్టా సర్దుకున్నారు. అయితే నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలలో కొంతమంది ముఖ్యనేతలు మకాం వేశారు . ఎన్నికలు అయ్యేంతవరకు వారు అక్కడనే ఉండాలని ఆయా పార్టీల ఆదేశాలు జారీచేశాయి. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన వారు నియోజకవర్గాల పరిసరాలలో మకాం వేసి చక్రం తిప్పనున్నారనే సంకేతాలు నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది . శాంతి భద్రతల పరిరక్షణ కోసం స్థానికంగా ఉన్న పోలీసులే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1400 మంది పోలీసులను ఇక్కడకు రప్పించారు. వీరే కాకుండా కేంద్ర బలగాలు కూడా వచ్చాయి. దీంతో పోలీసులా వలయంలో కేంద్ర బలగాల పహారా మధ్య పోలింగ్ కొనసాగనున్నది .

బద్వేల్ లో కూడా కేంద్రబలగాలకు తోడు రాష్ట్ర పోలీసులను మోహరింప జేశారు. బీజేపీ ఫిర్యాదు తో ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణ కోసం అదనపు బలగాలను రప్పించారు. వైసీపీ , బీజేపీ హోరా హోరా తలపడుతున్నాయి. తెలుగు దేశం , జనసేన అభ్యర్థులను పోటీకి పెట్టలేదు .

Related posts

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద పడి ఏడుస్తున్నారు: అంబటి!

Drukpadam

కేటీఆర్.. నువ్వే కొత్త బిచ్చగాడివి: మధు యాష్కి ఫైర్!

Drukpadam

పుతిన్‌తో బైడెన్‌ భేటీ.. దశాబ్దం తర్వాత తొలిసారి కలిసిన నేతలు!

Drukpadam

Leave a Comment