Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం.. దళితబంధు నిలిపివేతపై హైకోర్టు కీలక తీర్పు!

ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం.. దళితబంధు నిలిపివేతపై హైకోర్టు కీలక తీర్పు!
-హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో దళితబంధుని నిలిపివేసిన ఈసీ
-ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు
-తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఉంటుందన్న హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బందు హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దళిత బందును హుజురాబాద్ లో కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కొంత మంది హైకోర్టు ను ఆశ్రయించారు. బుద్ధా పౌర్ణిమ ప్రాజక్టు చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య కూడా దళిత బందు నిలిపి వేయడంపై పిటిషన్ వేశారు. అన్ని పిటిషన్ లు కలిపి విచారించిన హైకోర్టు ధర్మాసనం ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం కూడా ఇది ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నుంచే కొనసాగుతున్న ప్రాజక్టు అయినందున అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. ప్రభత్వ నిర్ణయాన్ని కూడా హైకోర్టు తోసి పుచ్చింది. ఎన్నికల సమయంలో ఇలాంటి వాటిని అనుమతించమని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సంఘం వాదనతో కోర్ట్ ఏకీభవించింది.

హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని ఎన్నికల కమిషన్ నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల కమిషన్ నిర్ణయాల విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈసీ నిర్ణయాన్ని రద్దు చేయాలనే విన్నపాన్ని తోసిపుచ్చింది. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం తీర్పును వెలువరించింది. దీంతో ఎన్నికలు ఈ నెల 30 వ తేదీన జరగనున్నాయి. నవంబర్ 2 వ తేదీన కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ వరకు ఎన్నికల నిబంధనలు అమల్లో ఉంటాయి. అప్పటివరకు దళిత బందు అమలు సాధ్యం కాదు ….

Related posts

జగన్ నైతిక విలువలు ఉన్న వ్యక్తి: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు

Drukpadam

అమెరికా కోర్టు సంచలన తీర్పు.. కుమారుడికి తల్లిదండ్రులే 22 లక్షలు కట్టాలన్న జడ్జి!

Drukpadam

రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్..!

Drukpadam

Leave a Comment