Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హుజూరాబాద్‌లో లొల్లిలొల్లి..

పంపకాల్లో తేడాలు..
వర్గాల వారీగా విభజన
కొంతమందికే డబ్బులు ఇస్తున్నారంటూ రోడ్లపై ధర్నాలు
వరంగల్ వాయిస్, ఓరుగల్లు: హుజూరాబాద్ లో ఇన్నాళ్లు ప్రచార హడావుడి సాగగా.. ఇప్పుడు పంపకాల లొల్లి నడుస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలు డబ్బులు పంపిణీ చేస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ ఓటు కు ఆరు వేలు రూపాయలు ఇస్తోందంటూ ప్రచారం జోరందుకుంది. అంతేకాదు.. బుధవారమంతా సోషల్ మీడియాలో ఆరు వేలతో ఉన్న ప్యాకెట్ హల్ చల్ చేసింది. దీంతో ఓటర్లు తమకు కూడా రూ.6వేలు వస్తాయనే ఆశతో ఎదురుచూశారు. అయితే ఊళ్లలో కొంతమందికే డబ్బులు పంపిణీ చేసి.. మరికొందరికి ఇవ్వడం లేదంటూ ఆందోళనలు మొదలయ్యాయి. తమకెందుకివ్వరంటూ రోడ్లపై ఓటర్లు ధర్నాలు చేస్తున్నారు. వీణవంక మండలం గంగారం గ్రామంలో గురువారం పలువురు తమకు డబ్బులు ఇవ్వడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. స్థానిక నాయకులు పంచుకుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గమంతా ఇదే వాతావరణం నెలకొంది. దీంతో అధికార పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
దెబ్బతీసేనా…?
పైసల పంపిణీ వ్యవహారం అధికార పార్టీ ఓట్లను దెబ్బకొట్టేలా కనిపిస్తున్నది. తమను వేరు చేయడమెందుకంటూ మహిళలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో తామను ఎందుకు వెలివేస్తున్నట్లు డబ్బులు ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారు. స్థానిక లీడర్లు తమకు నచ్చివారికే డబ్బులు ఇస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడే అధికార పార్టీ ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడితే అది ఓటు రూపంలో తీవ్రంగా ఎఫెక్ట్ చూపనుంది.

Related posts

సిద్ధిపేట జిల్లాలో కేఏ పాల్ పై దాడి…

Drukpadam

మాట …మర్మం

Drukpadam

చిన్నారులను హెలికాప్టర్‌లో ఎక్కించుకుని తిప్పిన పంజాబ్ సీఎం!

Drukpadam

Leave a Comment