Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ ఆంధ్రాలో పార్టీ పెట్టమని అంటున్నారన్న దానిపై రచ్చ రచ్చ ….

కేసీఆర్ ఆంధ్రాలో పార్టీ పెట్టమని అంటున్నారన్న దానిపై రచ్చ రచ్చ ….
రేవంత్ కు రోజూ రాజకీయాలు కావాలి… అందుకే ఇలా మాట్లాడుతున్నాడు: పేర్ని నాని
ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ పెట్టమంటున్నారన్న కేసీఆర్
రెండు రాష్ట్రాలను కలిపేయాలన్న పేర్ని నాని
తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ రేవంత్ వార్నింగ్
కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని

ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ పెట్టమంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ యస్ ప్లినరీలో అనడంపై రచ్చ కొనసాగుతున్నది. కేసీఆర్ అన్న ఆదేశం వేరు , వివిధ పార్టీల నాయకులూ స్పందిస్తున్న తీరువేరు…. కేసీఆర్ తన పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని అనేక రాష్ట్రాలు తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎలా సాధ్యం అవుతున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని ,ఆంధ్రాలో దళితబందు పై అక్కడ వాళ్ళ మా దగ్గర పార్టీ పెట్టండి మేమె గెలిపించుకుంటాం అని అంటున్నారని , కర్ణాటక ,మహారాష్ట్రల నుంచి కూడా రాయచూర్ ,నాందేడ్ లాంటి ప్రాంతాలు తెలంగాణాలో తమను కలపాలనే అక్కడ ప్రభుత్వాలను అడుగుతున్నారని అన్నారు.

దీనిపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆంధ్రాలో పార్టీ పెట్టేందుకు తమకు ఎలాంటి అభ్యంతరంలేదు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు కానీ కేసీఆర్ అంతకు ముందు విడిపోయిన రెండు రాష్ట్రాలను కలపాలని తన కాబినెట్ లో తీర్మానం చేయించాలని ఆ తరవాతనే ఇక్కడ్నించే పోటీ చేయొచ్చని సలహా ఇవ్వడం తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడుతూ తెలంగాణ జోలికి వచ్చారో ఖబడ్దార్ అంటూ ఇద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.

రోజూ రాజకీయాల్లో ఉండాలనుకునేవారు ఇలాగే మాట్లాడతారని విమర్శించారు. రేవంత్ కు రోజూ రాజకీయాలు కావాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏమన్నారో, ఆ వ్యాఖ్యలపైనే తాను మాట్లాడానని పేర్ని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారని, ఇలా డొంకతిరుగుడు ఉండదని అన్నారు.

ఏ పార్టీ వారైనా డైరెక్ట్ గా మాట్లాడాలని, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు మాట్లాడకూడదని హితవు పలికారు. తెలంగాణలో ఒక తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోతాయని, మళ్లీ కొత్త పార్టీ ఎందుకున్నదే తన అభిప్రాయమని మంత్రి పేర్ని నాని ఉద్ఘాటించారు.

Related posts

అహ్మదాబాద్ ప్రొఫెసర్ వ్యాఖ్యాతగా లోకేశ్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం…!

Drukpadam

గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ.. సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు!

Drukpadam

అందులో నిజం లేదు …టీడీపీ లో చేరిక పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన!

Drukpadam

Leave a Comment