Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మధిర సభలో భట్టి, కమల్ రాజు మద్య పరస్పర విమర్శలు…

మధిర సభలో భట్టి, కమల్ రాజు మద్య పరస్పర విమర్శలు…
-పరస్పరం నిందించుకున్న నేతలు
-సభలో భట్టి ప్రసంగిస్తుండగా కలగజేసుకున్న జడ్పీ చైర్మన్ కమల్ రాజ్
-ఇది సభామర్యాద కాదన్న భట్టి
-నువ్వెంటి నాకు మర్యాద చెప్పేదన్న కమల్ రాజ్
-కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గీయుల మధ్య తోపులాట.
-కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో వివాదం.
-చివరకు పోలీసులు , కొందరు నాయకుల జోక్యం తో సర్దు మునిగిన వివాదం

మధిర తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. చెక్కుల పంపిణీ ఆలస్యం కాకుండా లబ్ధిదారులకు అందించాలని గతంలో తాసిల్దార్ కు తెలియపరచడం జరిగిందని భట్టి మాట్లాడుతుండగా.. జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మధ్యలో జోక్యం చేసుకొని మాట్లాడటంపై వివాదం మొదలైంది. ఇది సభ మర్యాద కాదని భట్టి అభ్యంతర పెట్టడం , మండల ప్రజాప్రతినిధులు లేకుండా చెక్కులు ఎలా పంపిణీ చేస్తారు అని లింగాల కమల్ రాజ్ అనటంతో.. తెరాస కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు మిగతా నేతలు కలగజేసుకుని గొడవను సర్ది చెప్పారు. దీంతో కాంగ్రెస్ ,టీఆర్ యస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దూషణలు ,తోపులాటలులతో సభ ప్రాంగణం అంత గందరగోళంగా మారింది. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాకుండా అయింది. భట్టి జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ నిచ్చేష్టులై ఉన్నారు. వేదికమీదనే భట్టి ,కమల్ రాజ్ ఉన్నారు.

షాదీ ముబారక్ , కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే జాప్యం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీనిపై భట్టి కూడా గతంలోనే స్పందించి స్థానిక ఎం ఆర్ ఓ కు చెప్పినట్లు తెలిపారు. తాను ఉన్న లేకున్నా చెక్కుల పంపిణి చేయమన్నానని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేకుండా ఎలా పంపిణి చేస్తారని జడ్పీ చైర్మన్ అభ్యంతర పెట్టారు.

మధిర నియోజవర్గ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా భాద్యత యుతమైన స్థానంలో ఉండి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కి చెక్కుల పంపిణి లో జాప్యం జరగడం పై అసంతృప్తి ఉండి.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అప్లై చేసుకున్న లబ్ధిదారుల కై మంజూరుపై సంతకాలు పెట్టుకోకుండా కాలయాపన చేసి చెక్కు పై వచ్చిన డేట్ అయిపోయేవరకు చెక్కులు పంచగా పోవడన్నీ తప్పు పడుతున్నారు.

Related posts

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు: సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు…

Drukpadam

భట్టి ఆరోపణలపై మంత్రి పువ్వాడ మండిపాటు

Drukpadam

ఢిల్లీలో గాలి.. వర్ష బీభత్సం దృశ్యాలు ….

Drukpadam

Leave a Comment