Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హుజూరాబాద్‌ పోలింగ్‌లో ఉద్రిక్త‌త‌.. స్వల్ప ఘర్షణలు…

హుజూరాబాద్‌ పోలింగ్‌లో ఉద్రిక్త‌త‌.. స్వల్ప ఘర్షణలు…
పోటెత్తిన ఓటర్లు …కోసిక్ రెడ్డిని అడ్డగించిన బీజేపీ కార్యకర్తలు
కౌశిక్ రెడ్డిని నిల‌దీసిన బీజేపీ నేత‌లు.. ర‌క్ష‌ణ‌గా నిలిచిన పోలీసులు
పలుగ్రామాల్లో బీజేపీ ,టీఆర్ యస్ మధ్య మాటల యుద్ధం
పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన మహిళలు
భారీగా పోలింగ్ నమోదు అయ్యే అవకాశం
గుమ్మకల్ వెళ్లిన టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి
అడ్డుకున్న బీజేపీ నేత‌లు
చీఫ్ ఎల‌క్ష‌న్ ఏజెంట్‌నంటూ ఐడీ కార్డు చూపిన కౌశిక్
చివ‌ర‌కు వెన‌క్కు పంపిన పోలీసులు

బీజేపీ, టీఆర్ఎస్ హోరాహోరీగా త‌ల‌ప‌డుతోన్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన‌ పోలింగ్ ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య కొన‌సాగుతోంది. పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప‌లు పోలింగ్ కేంద్రాల్లో టీఆర్ఎస్, బీజేపీ నేతలు, పరస్పర ఆరోపణలు చేసుకున్నారు . మరోపక్క టీఆర్ఎస్ శ్రేణుల‌తో క‌లిసి ఘ‌న్ముక్ల‌కు వచ్చిన ఆ పార్టీ నేత కౌశిక్ రెడ్డిని బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పోలిసుల జోక్యం తో గొడవ సర్దుమణిగింది.

ప‌దేప‌దే ఘ‌న్ముక్ల‌కు ఎందుకు వ‌స్తున్నారంటూ కౌశిక్‌రెడ్డిని బీజేపీ నేత‌లు నిల‌దీశారు. ఆయన దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారంటూ బీజేపీ నేత‌లు ఆరోపించారు. దీంతో చీఫ్ ఎల‌క్ష‌న్ ఏజెంట్‌నంటూ కౌశిక్ రెడ్డి ఐడీ కార్డు చూపారు. త‌న‌కు 305 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కిడికైనా వెళ్లే హ‌క్కు ఉంద‌ని కౌశిక్ రెడ్డి చెప్పారు. బీజేపీ నేత‌లు ఫ్ర‌స్టేష‌న్ తోనే త‌న‌ను అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ కార్య‌క‌ర్త‌లు చుట్టుముడుతుండ‌డంతో ఆయ‌న‌కు ర‌క్ష‌ణ‌గా పోలీసు సిబ్బంది నిలిచారు. అనంత‌రం కౌశిక్ రెడ్డికి పోలీసులు స‌ర్దిచెప్ప‌డంతో ఆయ‌న పోలింగ్ కేంద్రం నుంచి తిరిగి వెళ్లిపోయారు. మ‌రోవైపు, జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగడం అల‌జ‌డి రేపింది. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఆరోపించారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గల 176వ బూత్ వ‌ద్ద స్థానికేతరులు ఎందుకు ఉన్నార‌ని బీజేపీ నేతలు నిల‌దీశారు. అధికారులు ఎన్నికలు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు వెబ్‌కాస్టింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా పోలీసు యంత్రాంగం పోలింగ్ నేప‌థ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ప‌లు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు.

Related posts

కార్డు లేకుండానే ఇకపై ఏటీఎం నుంచి డబ్బులు డ్రా!

Drukpadam

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక!

Drukpadam

పాద యాత్రలో సాధారణ జీవితం: బండి సంజయ్

Drukpadam

Leave a Comment