Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేటీఆర్… ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడంలేదా?: రేవంత్ రెడ్డి…

కేటీఆర్ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడంలేదా?: రేవంత్ రెడ్డి
ఫ్రాన్స్ లో కేటీఆర్ పర్యటన
రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడుల కోసం ప్రయత్నాలు
మంచిర్యాల జిల్లాలో నిరుద్యోగి మహేశ్ ఆత్మహత్య
తీవ్రస్థాయిలో స్పందించిన రేవంత్ రెడ్డి

రాష్ట్రమంత్రి కేటీఆర్ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు … అక్కడ నుంచి రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.ఇక్కడ రాష్ట్రంలో ఉపాధి లేక నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గుగా లేదా అని కేటీఆర్ ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంచిర్యాలలో నిరుద్యోగిమరణంపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే వైయస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల మంగళవారం ,మంగళవారం నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇవ్వాలని దీక్షలు చేస్తుండగా ఇటీవల మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల లో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. యువనేత ఫ్రాన్స్ పర్యటనలో మరిన్ని పెట్టుబడులకోసం చేస్తున్న ప్రయత్నాలు నిరుద్యోగ యువతకు ఎంతవరకు ఉపయోగపడతాయో ఎన్ని పెట్టుబడులు వస్తాయో !

రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు స్థాపించడానికి వీలుగా విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్ లో పర్యటిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. మంచిర్యాల జిల్లాలో మహేశ్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ కేటీఆర్ ను నిలదీశారు.

ఫ్రాన్స్ నుంచి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నాం, లక్షలాది ఉద్యోగాలు తెస్తున్నాం అని చెబుతున్నారు. కానీ పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడంలేదా కేటీఆర్? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగి మహేశ్ తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత ఆవేదనతో అడుగుతున్న ప్రశ్న ఇది అని వెల్లడించారు. ఈ సందర్భంగా యువతకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని, మరణం కాదు రణం చేద్దామని రేవంత్ పిలుపునిచ్చారు.

Related posts

టీఆర్ యస్ ను ఓడించే శక్తి బీజేపీకే ఉంది … కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Drukpadam

రాజగోపాల్ రెడ్డి నిర్ణయం …వెంకటరెడ్డికి నష్టం కలిగిస్తుంది…విహెచ్

Drukpadam

బీఎస్పీలో చేరనున్న మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్!

Drukpadam

Leave a Comment