Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రేపు ‘హుజూరాబాద్, బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు… ఏర్పాట్లు పూర్తి…

రేపు ‘హుజూరాబాద్, బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు… ఏర్పాట్లు పూర్తి…
-గత నెల 30న ఉప ఎన్నికలు
-నవంబరు 2న ఓట్ల లెక్కింపు
-ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
-హుజురాబాద్ 22 రౌండ్లు , బద్వేల్ 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
-హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఆసక్తి
-ఈటల రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక
-వైకాపా అభ్యర్థి వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక
-బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల టీఆర్ యస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగిన సంగతి విదితమే. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నిక అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. అక్టోబరు 30న పోలింగ్ నిర్వహించారు. రేపు (నవంబరు 2) ఓట్ల లెక్కింపునకు అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ షురూ కానుంది. 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు సాగనుంది. 14 టేబుళ్ల వద్ద ఓట్లు లెక్కించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటల సమయానికి ఫలితం వెల్లడి అవుతుందని భావిస్తున్నారు.

హుజూరాబాద్ బరిలో ఈటల రాజేందర్ బీజేపీ తరఫున బరిలో దిగగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ తరఫున వెంకట్ బల్మూరి పోటీపడ్డారు.

అక్టోబరు 30 నే బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ జరగ్గా, రేపు (నవంబరు 2) ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బద్వేలులోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 10 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. 4 హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

దీనిపై రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ, 281 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగిందని, ఓటింగ్ లో ఉపయోగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచామని తెలిపారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరుస్తామని చెప్పారు.

Related posts

బాల్ బ్యాడ్మింటన్ మాంత్రికుడు అర్జున పిచ్చయ్య(104) మృతి!

Drukpadam

సీజేఐ హోదాలో తొలిసారి అమరావతి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ… హైకోర్టులో ఘన సన్మానం

Drukpadam

చంద్రబాబు బ్యారక్ లోకి గంజాయి వేశారు.. పెన్ కెమెరాతో చంద్రబాబు కదలికలు రికార్డ్ చేశారు: న్యాయవాది లక్ష్మీనారాయణ ఆరోపణ…

Ram Narayana

Leave a Comment