Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీకి 90089 రికార్డు మెజార్టీ!

బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీకి 90089 రికార్డు మెజార్టీ!
-సంబ‌రాల్లో వైసీపీ శ్రేణుల
-వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి డాక్టర్‌ దాసరి సుధ గెలుపు
-మొత్తం రౌండ్లు ముగిసేసరికే వైసీపీకి మొత్తం లక్ష 11 వేల 710 ఓట్లు
-బీజేపీకి 21 వేల 638 ఓట్లు
-కాంగ్రెస్ కు కేవలం 6223 వేల ఓట్లు

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా లోని బద్వేల్ శాసనసభకు జరిగిన ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ సుధా ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో వైకాపా పని అయిపోయిందని జగన్ పాలనా పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైకాపా ఘోరంగా ఓడిపోతుందని టీడీపీ ,బీజేపీ , జనసేన పార్టీలు నిత్యం చెబుతున్న మాటలు సత్యదూరమని ఈ ఎన్నిక నిరూపించింది. బీజేపీ కి అక్కడ పెద్దగా బలం లేనప్పటికీ కేవలం టీడీపీ , జనసేన ఓట్లు తనకు అనుకూలంగా వేయించుకోవాలని ఉద్దేశంతో పోటీలోకి దిగింది. కానీ అనుకున్న విధంగా ఓట్లు రాలేదు. ఒక సందర్భంలో బద్వేల్ లో ఫలితం వైకాపా కు వ్యతిరేకంగా రాబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ బద్వేల్ ఓటర్లు జగన్ పాలన పట్ల సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. రికార్డు మెజార్టీ ఇచ్చారు. బహుశా రాష్ట్ర చరిత్రలో ఇంతటి మెజార్టీ గతంలో వచ్చి ఉండకపోవచ్చునని అంటున్నారు.

కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తీ అయింది.ఎన్నికల అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. . వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి డాక్టర్‌ దాసరి సుధ విజ‌యం ఖ‌రారైంది. 10 రౌండ్లు ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా కు లక్ష 11 వేల 710 ఓట్లు, బీజేపీకి 21 వేల 638 ఓట్లు వ‌చ్చాయి. అలాగే, కాంగ్రెస్‌కు 6223 ఓట్లు, నోటాకు 2,830 ఓట్లు వ‌చ్చినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు..

మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపునుంచి చివరి రౌండ్ వరకు వైసీపీకి ఓటర్లు తిరుగులేని ఆధిక్యత కట్టబెట్టారు బద్వేల్ ఓటర్లు బీజేపీకి 21 వేల 638 ఓట్లు , కాంగ్రెస్‌కు 6223 , నోటాకు 2,830 ఓట్లు ద‌క్కాయి. ఎనిమిది రౌండ్లు ముగిసే స‌రికే వైసీపీ 68,492 ఓట్ల ఆధిక్యంలో ఉండ‌డంతో ఆ పార్టీ అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. ఓట్ల లెక్కింపు తుది ద‌శ‌లో ఉంది. ఇప్ప‌టికే పూర్తి ఆధిక్యంలో సుధ ఉండ‌డంతో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు మొద‌లు పెట్టారు. టీడీపీ ,జనసేన టెక్నికల్ గా పోటీపెట్టనప్పటికీ బీజేపీ కి అనుకూలంగా పనిచేసినట్లు వైసీపీ ఆరోపించింది.పోలింగ్ ఏజెంట్లుగా కూడా టీడీపీ నాయకులే బీజేపీ కి పని చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

వైసీపీ శ్రేణుల సంబరాలు ….

బద్వేల్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన వైసీపీ ఘన విజయం సాధించింది.దీంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నాయి.

Related posts

దయచేసి మీరు అత్యవసరంగా దిగిపోండి: మోదీకి అరుంధతీరాయ్ లేఖ!

Drukpadam

మోదీ, అమిత్ షా అహంకారానికి మునుగోడు ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు: కేటీఆర్

Drukpadam

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరతపై కేరళ సీఎం ఆందోళన:కేంద్రంపై వత్తిడికి కలిసి రావాలని11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ…

Drukpadam

Leave a Comment