Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇది ఈటల రాజేందర్ గెలుపు.. బీజేపీ గెలుపు కాదు: పొన్నం ప్రభాకర్!

ఇది ఈటల రాజేందర్ గెలుపు.. బీజేపీ గెలుపు కాదు: పొన్నం ప్రభాకర్!
-ఈటల గెలుపు బీజేపీ గెలుపంటూ బండి సంజయ్ చెప్పడం సరికాదు
-ఈటల రాజేందర్ బీజేపీ గురించి ఎక్కడా చెప్పుకోలేదు
-ఈటల గెలవాలని బండి సంజయ్ కోరుకోలేదు
-హుజూరాబాద్ ఫలితాలు ఊహించిన విధంగానే వచ్చాయి
-ఈటలకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వక తప్పలేదు …కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల సరళి అధికార టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నిరాశను కలిగిస్తోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 23 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హుజూరాబాద్ ఫలితాలు ఊహించిన విధంగానే వచ్చాయని ఇందులో ఆశ్చర్య పడాల్సిన విషయం ఏమిలేదని అన్నారు. తనను మంత్రి పదవి నుంచి కేసీఆర్ అప్రజాస్వామిక పద్ధతిలో తొలగించారనే విషయాన్ని ఈటల రాజేందర్ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని పొన్నం చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతించలేదని అన్నారు.

ఈటల గెలుపు బీజేపీ విజయంగా బండి సంజయ్ చెప్పడం సరికాదని పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. వాస్తవం చెప్పాలంటే, ఈటల గెలవాలని బండి సంజయ్ కోరుకోలేదని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ సొంతంగా ప్రచారం చేసుకున్నారని… బీజేపీ అభ్యర్థినని ఎక్కడా చెప్పుకోలేదని అన్నారు. ఇది ముమ్మాటికీ ఈటల గెలుపు మాత్రమేనని… బీజేపీ గెలుపు కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… ఈటలకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వక తప్పలేదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

ఈటల రాజేందర్ కు మద్దతు ఇవ్వక తప్పలేదు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

 

హుజూరాబాద్ ఎన్నికలు, ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ పెద్ద షాక్ ఇవ్వబోతున్నారని చెప్పారు. తెలంగాణలో సంచలన ఫలితాన్ని మనం చూడబోతున్నామని అన్నారు.

ఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులను ఒడ్డిందని కోమటిరెడ్డి చెప్పారు. ఐదు నెలల్లోనే టీఆర్ఎస్ రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. మద్యం ఏరులై పారిందని అన్నారు. అయినప్పటికీ టీఆర్ఎస్ కు అదిరిపోయే తీర్పును హుజూరాబాద్ ప్రజలు ఇవ్వనున్నారని చెప్పారు.

శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతం ప్రకారం ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వక తప్పలేదని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి, చివరకు టీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందనే తాము కాస్త వెనక్కి తగ్గామని చెప్పారు. ఈటలకు పరోక్షంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. నాగార్జునసాగర్, దుబ్బాక ఎన్నికల్లో పని చేసినట్టు హుజూరాబాద్ లో తాము చేయలేదని చెప్పారు.

Related posts

ఆదిత్య థాకరేను చూసి “మ్యావ్” అంటూ పిల్లిలా అరిచిన బీజేపీ ఎమ్మెల్యే!

Drukpadam

వసంత కృష్ణ ప్రసాద్ కు తనకు గొడవేం జరగలేదు: పేర్ని నాని

Drukpadam

22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు.. బస్సులో ప్రపంచ యాత్ర!

Drukpadam

Leave a Comment