Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీడీపీ నేత‌ల ప‌రుష ప‌దజాలంపై రాష్ట్ర‌ప‌తికి వైసీపీ ఎంపీల బృందం ఫిర్యాదు

టీడీపీ నేత‌ల ప‌రుష ప‌దజాలంపై రాష్ట్ర‌ప‌తికి వైసీపీ ఎంపీల బృందం ఫిర్యాదు

  • జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై, మా పార్టీపై ప‌రుష ప‌ద‌జాలం
  • చంద్ర‌బాబు నాయుడు, లోకేశ్, ప‌ట్టాభిపై ఫిర్యాదు
  • టీడీపీ శ్రేణులు మాట్లాడుతోన్న ప‌రుష‌ ప‌ద‌జాలంపై వివ‌ర‌ణ ఇచ్చాం
  • మీడియాకు తెలిపిన విజ‌య‌సాయిరెడ్డి
టీడీపీ నేత‌లు మాట్లాడుతోన్న భాష బాగోలేదంటూ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు వైసీపీ ఎంపీల‌ బృందం ఫిర్యాదు చేసింది. ఈ సంద‌ర్భంగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘ఈ రోజు మా ఎంపీలంద‌రం రాష్ట్ర‌ప‌తిని క‌లిశాం. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై, మా పార్టీపై చంద్ర‌బాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్, టీడీపీ నేత‌ ప‌ట్టాభితో పాటు టీడీపీ శ్రేణులు మాట్లాడుతోన్న ప‌రుష‌ ప‌ద‌జాలంపై ఫిర్యాదు చేశాం. టీడీపీ గుర్తింపును ర‌ద్దు చేయాల‌ని మేము రాష్ట్ర‌ప‌తిని కోరాము’ అని విజ‌య‌సాయిరెడ్డి వివ‌రించారు.

టీడీపీ ఎంపీల స్పందన

  • రాష్ట్రపతితో వైసీపీ ఎంపీల భేటీ
  • పదవుల్లో ఉన్నవారిని దూషిస్తే శిక్షించేలా చట్టం తేవాలని విజ్ఞప్తి
  • ఏనాడైనా చట్టాలను గౌరవించారా అంటూ కనకమేడల ఆగ్రహం
  • మంత్రుల వ్యాఖ్యలను అందరూ గమనిస్తున్నారన్న కేశినేని
TDP leaders responds on YCP MPs meeting with President Of India
టీడీపీ ఓ టెర్రరిస్టు పార్టీ అని, ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవడం తెలిసిందే. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని దూషిస్తే కఠినంగా శిక్షించేలా చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని స్పందించారు.

ఏనాడూ చట్టాలను గౌరవించని వైసీపీ నేతలు నేడు, చట్టాలు చేయాలంటూ రాష్ట్రపతిని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న విష సంస్కృతికి వైసీపీనే కారణమని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. సంస్కారం, నాగరికత గురించి వైసీపీ సభ్యులు మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ నేతలు చంద్రబాబును మాట్లాడిన మాటలు ఓసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని సూచించారు. ఏం అర్హత ఉందని చంద్రబాబు గురించి మాట్లాడతారని కనకమేడల ప్రశ్నించారు.

కేశినేని నాని మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని దూషిస్తే కఠినంగా శిక్షించేలా చట్టం చేయాలని రాష్ట్రపతిని వైసీపీ నేతలు కోరడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రతిపక్ష నేత పదవి కూడా రాజ్యాంగబద్ధ పదవేనన్న విషయం వైసీపీ నేతలకు తెలుసో? లేదో? అని వ్యాఖ్యానించారు. అసలు, రాష్ట్రంలో పార్టీ ఆఫీసులపైనా, పార్టీ నేతల ఇళ్లపైనా దాడులు చేసి ఇవాళ రాష్ట్రపతిని ఏ విధంగా కలిశారని కేశినేని నాని నిలదీశారు. వైసీపీ పాలనలో మంత్రులు విపక్షనేతపై చేస్తున్న వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు.

Related posts

మునుగోడులో పోటీ చేయాలా..? వద్దా…?? టీడీపీ మేధోమధనం…

Drukpadam

ప్రజలకు భరోసా ఇవ్వగలిగామన్న తృప్తి ఉంది : సీఎం జగన్…

Drukpadam

వివేకా హత్యకు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చినట్టు తెలిసినా… ప్రభుత్వంలో కదలిక లేదు: వర్ల రామయ్య!

Drukpadam

Leave a Comment