Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

శ్రీనగర్ ఆసుపత్రిలో ఉగ్రవాదుల కాల్పులు.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతాబలగాలు!

-శ్రీనగర్ ఆసుపత్రిలో ఉగ్రవాదుల కాల్పులు.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతాబలగాలు!
-కాల్పుల్లో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు
-జనాల మధ్య నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు
-ముష్కరుల కోసం శ్రీనగర్ ను జల్లెడ పడుతున్న భద్రతాబలగాలు

జమ్మూ కాశ్మిర్ లో ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి.పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అక్కడ 370 ఆర్టికల్ రద్దు చేసిన తరువాత శాంతి వైపు కాశ్మిర్ ప్రజలు పయనిస్తారని కేంద్రం భావించింది. ఆ రాష్ట్రానికి చేయండిన వివిధ పార్టీల ముఖ్యనేతలను నిర్బంధించింది. ఈ చర్యలన్నీ అక్కడ శాంతిని పునరుద్దరించేందుకేనని కేంద్రం చెబుతూ వచ్చింది.అయినప్పటికీ అక్కడ శాంతి లేకపోగా భయంగుప్పెట్లో ప్రజలు బతుకు తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి . కొద్దీ రోజుల క్రితమే ఒక పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లను ఉగ్రముఖాలు కిరాతకంగా కాల్చి చంపాయి.

జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని ఒక ఆసుపత్రిపై వారు దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ ఘటన నుంచి ఉగ్రవాదులు సురక్షితంగా తప్పించుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న జనాల మధ్య నుంచి వారు ఆ ప్రాంతం నుంచి బయటపడ్డారు.

ఈ ఘటనపై శ్రీనగర్ పోలీసులు స్పందిస్తూ… టెర్రరిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న జనాల మధ్య నుంచి ఉగ్రవాదులు తప్పించుకుని వెళ్లిపోయారని వెల్లడించారు. ఎన్డీటీవీ కథనం ప్రకారం ఒక వ్యక్తి ఈ కాల్పుల్లో గాయపడ్డాడు. అతనికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

మరోవైపు ఈ ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రిని, దానికి సంబంధించిన మెడికల్ కాలేజీని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. వలస కూలీలపై టెర్రరిస్టులు ఇటీవల దాడి చేసిన తర్వాత టెర్రరిస్టులు బరితెగించడం ఇదే తొలిసారి. ఆ దాడి జరిగిన తర్వాత మరో 50 కంపెనీల సెక్యూరిటీని శ్రీనగర్ లో మోహరింపజేశారు. అయినా, ఈరోజు దాడి జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో శ్రీనగర్ ను భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్నాయి.

Related posts

భువనగిరి కలెక్టరేట్‌లో కత్తిపోట్ల కలకలం.. ఏఈవోపై మహిళా అధికారి కత్తితో దాడి.. ప్రేమ వ్యవహారమే కారణం!

Ram Narayana

నా చెల్లెల్ని కూడా పెళ్లాడితేనే మన పెళ్లి జరుగుతుంది’ ఓకే అన్న యువకుడు

Drukpadam

అదృశ్యమైన జెన్‌కో ఉద్యోగి కుటుంబ సభ్యుల మృతదేహాలు లభ్యం!

Drukpadam

Leave a Comment