Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ లో పెట్రో ధరలు తగ్గించాల్సిందే …ఆందోళనలకు చంద్రబాబు పిలుపు ….

ఏపీ లో పెట్రో ధరలు తగ్గించాల్సిందే …ఆందోళనలకు చంద్రబాబు పిలుపు ….
-ఇతర రాష్ట్రాల్లో తగ్గించారు …ఏపీలోనూ తగ్గించాలని డిమాండ్
-విపక్ష నేతగా ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేసిన జగన్ ఇప్పుడేం చెబుతారు?: చంద్రబాబు
-భగ్గుమంటున్న చమురు ధరలు
-పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై పడుతుందని వెల్లడి
-ఏపీలో పెట్రోలు ధ‌ర‌లు రూ.16 త‌గ్గించి తీరాలి: ఆందోళ‌న‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు
-ఈ నెల 9న అన్ని పెట్రోల్ బంకుల వ‌ద్ద ఆందోళ‌న‌లు
-మ‌ధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వ‌ర‌కు నిర‌స‌న‌
-పెట్రోలు ధ‌ర‌లు త‌గ్గించే వ‌ర‌కు పోరాటం
-అధికారంలోకి వ‌స్తే పెట్రోలు రేట్లు త‌గ్గిస్తామ‌ని జ‌గ‌న్ చెప్పార‌ని వ్యాఖ్య‌

ఏపీలో పెట్రో ధరలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికం అని అన్నారు. అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గిస్తుంటే ఏపీలో ఎందుకు తగ్గించడంలేదంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేసిన జగన్ ప్రస్తుత పరిస్థితిపై ఏం సమాధానం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెట్రో ధరల పెంపును తీవ్రంగా పరిగణించాల్సిందేనని, పెట్రో ధరల పెంపు ప్రభావం అనేక రంగాలపై ఉంటుందని అన్నారు. ధరల పెంపు కారణంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ప్రజలపైనా తీవ్ర భారం పడుతోందని చంద్రబాబు వివరించారు. అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని నాడు జగన్ చెప్పారని గుర్తు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.అనేక రాష్ట్రాలలో పెట్రో ధరలు రాష్ట్రప్రభుత్వాలు తగ్గిస్తున్నాయి ఇక్కడ ఎందుకు తగ్గించడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.
ఏపీలో పెట్రోలు ధ‌ర‌లు క‌నీసం రూ.16 త‌గ్గించి తీరాల‌ని టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఈ నెల 9న అన్ని పెట్రోల్ బంకుల వ‌ద్ద ఆందోళ‌న‌లు చేప‌డ‌తామ‌ని చెప్పారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వ‌ర‌కు ఈ ఆందోళ‌న‌ల్లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. పెట్రోలు ధ‌ర‌లు త‌గ్గించే వ‌ర‌కు త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని చెప్పారు.

అధికారంలోకి వ‌స్తే పెట్రోలు రేట్లు త‌గ్గిస్తామ‌ని జ‌గ‌న్ చెప్పార‌ని ఆయ‌న గుర్తు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం సుంకం త‌గ్గించిన త‌ర్వాత దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్రోలు ధ‌ర‌లు త‌గ్గించాయ‌ని, ఏపీలో మాత్రం త‌గ్గించ‌లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో పెట్రోలు ధ‌ర‌ల‌పై జ‌గ‌న్ ఆందోళ‌న చేశార‌ని చంద్ర‌బాబు అన్నారు. అధికారం చేతిలో ఉంద‌ని జ‌గ‌న్ ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మండిపడ్డారు .

Related posts

నేడే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోంలో అసెంబ్లీ ఎన్నికలు…

Drukpadam

యూపీలో బీజేపీకి ఎదురుగాలి… సమాజ్ వాదీ గూటికి చేరిన మరో మంత్రి!

Drukpadam

పవన్ కల్యాణ్… నువ్వు అడిగిన ప్రతి మాటకు అక్టోబరు 10 తర్వాత సమాధానం చెబుతా: మోహన్ బాబు!

Drukpadam

Leave a Comment