రాజుకుంటున్న యూ పీ ఎన్నికల వేడి …
-ఇప్పటికే పోటీ చేయనని ప్రకటించిన అఖిలేష్ యాదవ్
-అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై యోగి ఆదిత్యనాథ్ స్పందన
-నేను పోటీ చేసే అంశంపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
-ఆ తర్వాతే ఎన్నికల బరిలో దిగుతా
-ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాం
మరికొన్ని నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై రాజకీయ పార్టీలు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తాను పోటీ చేసే అంశంపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎన్నికల బరిలో దిగుతానని తెలిపారు. తాను ఈ ఎన్నికల్లో ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తాననే విషయంపై కూడా అప్పుడే స్పష్టత వస్తుందని చెప్పారు. తనతో పాటు పార్టీ నేతలు అందరూ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయం బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని అన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ బీజేపీ నెరవేర్చిందని చెప్పారు. యూపీలో శాంతి భద్రతలను కాపాడామని అన్నారు.
దేశంలోని పెద్ద రాష్ట్రం …దేశరాజకీయాలను ప్రభావితం చేయగల లోకసభ సభ్యులు ఉన్న రాష్ట్రం యూ పీ లో ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంటుంది . ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల పై ద్రుష్టి సారించాయి.ప్రధానంగా బీజేపీ ,ఎస్పీ లు పోటీపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై స్పందించారు. తన పోటీ బీజేపీ నిర్ణయిస్తుందని , ఎక్కడ నుంచి పోటీచేయాలి ,అసలు పోటీ చేయాలా వద్ద అనేది తన చేతుల్లో లేదని పార్టీ చేతుల్లోనే ఉందని అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రధానం ప్రతిపక్షంగా ఉన్న ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ తాను ఎన్నికల్లో పోటీ చేయడంలేదని అయితే ప్రచార భాద్యతలు తీసుకుంటునందున పోటీ చేయడంలేదని ప్రకటించారు. మాయావతి ఇంకా తన పోటీపై ఎలాంటి ప్రకటన చేయలేదు.