Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ ను జైళ్లే పెడతావా ?అంత దమ్ముందా ?? టచ్ చేసి చూడు :మీడియా సమావేశంలో బండి సంజయ్ పై కేసీఆర్ నిప్పులు!

కేసీఆర్ ను జైళ్లే పెడతావా ?అంత దమ్ముందా ?? టచ్ చేసి చూడు :మీడియా సమావేశంలోబండి సంజయ్ పై  కేసీఆర్ నిప్పులు!
చాలా రోజుల నుంచి ఇలాగే మాట్లాడుతున్నాడు…. నా స్థాయికి తగినవాడు కాదని వదిలేశా
హిందీ ,ఇంగ్లీష్ రాదుఢిల్లీ లో ఏమి మాట్లాడుతున్నాడో తెలియదుకనీసం కేంద్ర లెటర్స్ అర్థం కావు
బండి సంజయ్ వళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి
తమాషాగా ఉందా? సీఎం ,మంత్రులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా ?
మాకు 119 లో 110 సభ్యుల మద్దతు ఉంది
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం
అట్లా అనుకుంటే నాగార్జున సాగర్ లో డిపాజిట్ దక్కలేదు
దేశంలో 29 అసెంబ్లీ లకు ఎన్నికలు జరిగితే ఘోరంగా బీజేపీ ఓడిపోయింది.
దేశాన్ని సర్వనాశనం చేసింది బీజేపీ , జిడిపి కుప్పకూలిపోయింది.
కేంద్రం వరి ధాన్యం కొనడంలేదని ఆరోపణ
ప్రత్యామ్నాయ పంటలే మేలని సూచన
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం అద్భుతమైన రీతిలో అబద్ధం చెప్పింది: సీఎం కేసీఆర్
చమురు ధరలపై విమర్శనాస్త్రాలు
చమురు ధరలు పెంచింది కేంద్రమేతగ్గించాల్సింది వాళ్ళేమేము అధికారంలోకి వచ్చాకఒక్క రూపాయి వ్యాట్ పెంచలేదు
కేంద్రం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపణ

కేసీఆర్ ను జైళ్లే పెడతావా ?అంత దమ్ముందా ?? టచ్ చేసి చూడు ,ఏమౌతుందో …తమాషాగా ఉందా? చిల్లర మాటలు మాట్లాడి చిల్లర వేషాలు వేస్తె తాటతీస్తాం …ముఖ్యమంత్రిని ,మంత్రులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గతంలో ఉరుకున్నాం ఇక ఉరుకోము … నీకు దమ్ముంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చేలా చేయి. వరిపంట వేయవద్దని కేంద్రం అంటుంది వేసేలా కేంద్రంనుంచి పర్మిషన్ తీసుకురా ? అంతే గాని గాలి మాటలు కట్టిపెట్టు తెలంగాణ రైతులకు నష్టం జరిగితే కేసీఆర్ చూస్తూ ఊరుకోరు …పంజాబ్ లో ధాన్యం మొత్తం సేకరిస్తావు . ఇక్కడ కుదరదంటావు ఇదెక్కడి పాలసీ … రైతుల మోటార్లకు మీటర్లు బిగించమంటావు ఇదేనా రైతులపైనా మీకున్న ప్రేమ …ప్రాజక్టుల విషయంలో మావాటా తేల్చమంటే తేల్చవు… దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. బీజేపీ జిడిపి పాకిస్తాన్ బాంగ్లాదేశ్ కన్నా తగ్గింది. ఇదేనా మీ ప్రగతి …అని కేసీఆర్ ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బీజేపీ విధానాలపై , రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై తీవ్ర స్వరం తో ధ్వజమెత్తారు .మజోలికొస్తే తడాఖా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

మొదట రైతుల అంశంపై కేసీఆర్ స్పందించారు. రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో యాసంగిలో ఎలాంటి పంటలు వేయాలో శాస్త్రవేత్తలతో చర్చించి, అందుకు అనువైన విత్తనాలు కూడా తెప్పించామని అన్నారు. అయితే యాసంగి ధాన్యంలో తాలు, నూకలు ఎక్కువగా వస్తాయని, యాసంగి ధాన్యం నాణ్యంగా ఉండడంలేదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) చెబుతోందని తెలిపారు. యాసంగిలో రా రైస్ మాత్రమే కొంటామని, బాయిల్డ్ రైస్ కొనలేమని చెబుతోందని వివరించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనేక అభ్యంతరాలు పెడుతోందని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని కేంద్రం కరాఖండిగా చెబుతోందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం రోజుకోమాట చెబుతోందని మండిపడ్డారు. అందుకే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు చెబుతున్నామని, వేరుశనగ, చిరుధాన్యాలతో మంచి లాభాలు వస్తున్నాయని పేర్కొన్నారు.

“పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అత్యంత బాధ్యతా రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. మీరు వరి పంటనే వేయండి… ప్రభుత్వం మెడలు వంచి పంటను కొనిపిస్తాం అంటూ రైతులకు చెబుతున్నాడు. ఎవరి మెడలు వంచుతాడు? ఆయనే మెడ వంచుకుంటాడా? లేక కేంద్రం మెడలు వంచుతాడా? ఈయన ఓ ఎంపీ. చాలారోజుల నుంచి ఇలాగే మాట్లాడుతున్నాడు. కానీ క్షమిస్తున్నా. నా స్థాయికి తగిన మనిషి కాదు.. నాకంటే చిన్నవాడు. నా మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, కుక్కలు మొరుగుతున్నాయని పట్టించుకోలేదు.

కానీ ఏడేళ్లుగా మేం రైతుల కోసం చేస్తున్న కృషిని దెబ్బతీసేలా, రైతులను తప్పుదోవపట్టించేలా వ్యవహరిస్తుండడంతోనే స్పందించాల్సి వస్తోంది. ఈ పనికిమాలిన మాటలు నమ్మి వరి పంట వేస్తే చాలా కష్టం. వరి కొనబోమని కేంద్రం తెగేసి చెబుతోంది. రైతులను కాపాడుకునే బాధ్యత మా పైన ఉంది కాబట్టే ఇవాళ రైతులకు విన్నవిస్తున్నాం. రైతులు నష్టపోరాదనే వరి వద్దని మంత్రి చెప్పారు” అని కేసీఆర్ వివరించారు

పెట్రో ధరల గురించి మాట్లాడుతూ… పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం అద్భుతమైన పద్ధతిలో అబద్ధం చెప్పిందని అన్నారు. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిందని, అప్పటినుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర 105 డాలర్లకు మించలేదని తెలిపారు.

ఓసారి చమురు ధరలు కుప్పకూలి 30 డాలర్లకు కూడా పడిపోయిందని, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని, రష్యాలోనూ అలాంటి పరిస్థితే వచ్చిందని వివరించారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయంగా ధర పెరిగిందని అబద్ధాలు చెప్పిందని ఆరోపించారు. రాష్ట్రాల వాటా ఎగ్గొట్టేందుకు ట్యాక్సులు పెంచకుండా, దాన్ని సెస్ రూపంలోకి మార్చారని వివరించారు. ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నారని, ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ చీఫ్ మినిస్టర్ ఏకంగా పత్రికా ప్రకటన ఇచ్చారని వెల్లడించారు.

“నాడు పెట్రోల్ ధర రూ.77 ఉంటే దాన్ని రూ.114 చేశారు. డీజిల్ ధర రూ.68 ఉంటే రూ.107 చేశారు. ఈ పెరుగుదల మొత్తం కేంద్రమే తీసుకుంటోంది. రాష్ట్రాల నోరుకొడుతున్నారు. ప్రజలకు అబద్ధాలు చెబుతూ, మోసం చేస్తూ భారం మోపుతున్నారు. దానికితోడు రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఎగ్గొడుతున్నారు. ఇప్పుడు పలు రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో కంటితుడుపు చర్య కింద ఎక్సైజ్ సుంకం ఓ పది రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇదే ఓ ఘనకార్యం అన్నట్టు చెప్పుకుంటున్నారు. పెంచింది కొండంత, తగ్గించింది పిసరంత!

ఇంత మోసం చేసి, ఇప్పుడు రాష్ట్రాలు కూడా తగ్గించాలని చెబుతున్నారు. తగ్గించకపోతే ధర్నాలు చేస్తామని బీజేపీ వాళ్లు అంటున్నారు. ఎవరు ధర్నాలు చేయాలి? మీరా? మేమా? ఇప్పుడు మేం డిమాండ్ చేస్తున్నాం… చమురు ధరలపై మొత్తం సెస్ ను కేంద్రం ఉపసంహరించుకోవాలి. ప్రజల మీద అంత ప్రేమే ఉంటే 2014 నాటి ధర రూ.77కే ఇవాళ కూడా ఇవ్వొచ్చు” అని స్పష్టం చేశారు.

Related posts

వ్యవసాయ కార్మికుల సమగ్ర సంక్షేమ చట్టం చేయాలి: ఎర్ర శ్రీకాంత్ డిమాండ్

Drukpadam

వైసీపీ ఎమ్మెల్యేను ప్రశంసించడంపై కేశినేని నాని వివరణ!

Drukpadam

జో బైడెన్ ను ఎట్టి పరిస్థితుల్లో చంపరాదని నాడు అల్ ఖైదాను ఆజ్ఞాపించిన లాడెన్!

Drukpadam

Leave a Comment