Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తీన్మార్ మల్లన్నకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు!

 

తీన్మార్‌ మల్లన్నకు ఊర‌ట‌.. బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు!

  • దాదాపు రెండు నెలల నుంచి జైల్లో ఉన్న మ‌ల్ల‌న్న‌
  • రాష్ట్ర వ్యాప్తంగా న‌మోదైన‌ ప‌లు కేసుల్లో విచార‌ణ‌
  • మల్లన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ
తీన్మార్ మల్లన్న కు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. గత రెండు నెలల నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. కింది కోర్టులు ఆయన బెయిల్ తిరస్కరించాయి.చివరకు హైకోర్టు లో బెయిల్ లభించింది. తన భర్త ను అక్రమకేసుల్లో ఇరికించారని మల్లన్న భార్య కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కూడా కలిసి విన్నవించుకొన్నది. ఒక కల్లు దుకాణదారుని వద్ద డబ్బులు డిమాండ్ చేశారని ఆయనపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే .

జ‌ర్న‌లిస్టు తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌)కు ఎట్ట‌కేల‌కు బెయిల్ లభించింది. దాదాపు రెండు నెలల నుంచి ఆయన జైల్లో రిమాండ్‌లో ఉంటోన్న విష‌యం తెలిసిందే. కల్లు వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌తో పాటు ప‌లు కేసులు మల్లన్నపై న‌మోద‌య్యాయి. హైదరాబాద్‌ చిలకలగూడతో పాటు రాష్ట్రంలోని ప‌లు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అప్ప‌టి నుంచి జైలులోనే ఉంటున్నారు. బెయిల్ కోసం ఆయ‌న ఇంత‌కు ముందు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. చివ‌ర‌కు తీన్మార్‌ మల్లన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ రోజు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా, తన భర్తపై అక్రమ కేసులు పెట్టార‌ని ఫిర్యాదు చేస్తూ, మల్లన్న భార్య ఇటీవల కేంద్ర‌ హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని బీజేపీ తెలంగాణ నేత‌లు కూడా మండిప‌డ్డారు.

 

Related posts

Meet The Women At The Head of The Gym Revolution

Drukpadam

బండారు… రోజాపై అలా మాట్లాడుతావా? ఇప్పటికైనా సిగ్గుతెచ్చుకో: ఎంపీ నవనీత్ కౌర్

Ram Narayana

పేపర్ లీక్ దుమారం: టీఎస్ పీఎస్సీ ఆఫీస్ వద్ద రణరంగం!

Drukpadam

Leave a Comment