Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజురాబాద్ ఓటమితో సహనంకోల్పోయిన కేసీఆర్ …పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శ!

హుజురాబాద్ ఓటమితో సహనంకోల్పోయిన కేసీఆర్ …పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శ!
-బండి సంజయ్ పై విమర్శలు అర్థరహితం
-కేసీఆర్ కిలాడీ రాజకీయాలు ఇప్పటికైనా కట్టిపెట్టాలి
-ఇతరపార్టీలనుంచి గెలిచి టీఆర్ యస్ చేరిన ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించి గెలవాలి
-బీజేపీ రాష్ట్రాలలో ఇతరపార్టీ లనుంచి వచ్చినవారిని రాజీనామా చేయించి మళ్ళీ గెలిచినా -విషయాన్నీగమనించాలి
-కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలి

రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని నిందించడం పట్ల బిజెపి తెలంగాణా కోర్ కమిటీ సభ్యులు,మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు రాష్ట్ర పార్టీ జాతీయ కో కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రోజులు గా రైతు సమస్య పై కేసీఆర్ మాట్లాడుతున్న తీరు పై పొంగులేటి సుధాకర్ రెడ్డి సోమవారం తీవ్రంగా స్పందించారు.హుజూరాబాద్ ఓటమి తో ముఖ్యమంత్రి సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ కిలాడి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు..ముఖ్యమంత్రి తన స్థాయి మరచి తమ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగాఖండించారు .. హుజూరాబాద్ ఓటమి నైరాశ్యం తో మానసికంగా కుంగిపోయి కేసీఆర్ మాట్లాడుతున్నట్లు ఉన్నదన్నారు. రైతు బంధువు లమని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ రైతులు కష్టాలలో ఉంటే రెచ్చగొట్టే మాటలతో రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రాజెక్టులు , కాంట్రాక్టులు, కార్పోరేషన్ ల పేరుతో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ముఖ్యమంత్రి కి రైతు సమస్య ల పరిష్కారానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు..రైతు సమస్యల పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వానిదని..కేంద్ర ప్రభుత్వం తో సామరస్య పూర్వకంగా సంప్రదింపులతో సమస్య ను పరస్కరించుకోవాలని సూచించారు. బిజెపి ని విమర్శించే ముందు కేసీఆర్ కు దమ్ముంటే టిఆర్ఎస్ లో చేరిన ఇతర పక్షాల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి సవాల్ విసిరారు.మధ్య ప్రదేశ్ ,కర్ణాటక రాష్ట్రాల లో బిజెపి లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ గెలుపొందిన విషయాన్ని కేసీఆర్ తెలుసుకోని మాట్లాడితే బాగుంటుందని తెలిపారు.

Related posts

కేసీఆర్‌ చేపట్టిన పోరాటాలకు మా మద్దతు…కేరళ సీఎం పినరయి విజయన్‌

Drukpadam

విద్యార్థులు పోరాటాల్లో ముందు ఉండాలి…మనోహర్ రాజు

Drukpadam

సీబీఐ అదుపులో ఉన్న బెంగాల్‌ మంత్రులకు బెయిల్‌!

Drukpadam

Leave a Comment