Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రోడ్డు వేయలేదో.. ఆ ఎమ్మెల్యే మా చేతుల్లో చచ్చినట్టే: యూపీలో మహిళల హెచ్చరిక!

రోడ్డు వేయలేదో.. ఆ ఎమ్మెల్యే మా చేతుల్లో చచ్చినట్టే: యూపీలో మహిళల హెచ్చరిక!
మేం ఓట్లు వేస్తేనే అసెంబ్లీకి వెళ్లారు
ఎన్నికైన తర్వాత ఒక్క రోడ్డు కూడా వేయించలేకపోయారు
ఆయనకు ఓట్లు అడిగే హక్కులేదు
రోడ్డు వేయకుంటే చెప్పులతో కొట్టి చంపేస్తాం

రోడ్ వేయలేదో ఎమ్మెల్యే మాచేతిలో చచ్చినట్లే అని యూ పీ లోని మహాదేవ నియోజకవర్గం లోని ఒక గ్రామానికి చెందిన ఒకమహిళా స్థానిక ఎమ్మెల్యేకి అల్టిమేటం జారీచేయడం సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన సందర్భంగా మీ గ్రామానికి రోడ్ వేస్తానని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచినా తరువాత ఊరురావడంసరేసరి రోడ్ వేస్తానన్న వాగ్దానం మరిచారు. ఈ సారి ఎన్నికలు వచ్చాయి కదా తిరిగి ఆ ఎమ్మెల్యే ఓట్లకోసం మా ఊరు వస్తే చెప్పుదెబ్బలేనని మహిళా చెప్పు చూపించి మరీ అంటున్నారు. మహిళలు ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేయడం అందునా పాలక పక్ష ఎమ్మెల్యే ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది అక్కడ ఇక్కడ చర్చల్లోకి వచ్చి బీజేపీ జాతీయనాయకత్వం దృష్టికి సైతం వెళ్ళింది. తమ ఎమ్మెల్యే లపై వస్తున్నా ప్రజాగ్రహాన్ని చూసి బీజేపీ నేతలు కలవర పడుతున్నారు.

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రవి కుమార్ సోంకర్‌కు మహిళలు అల్టిమేటం జారీ చేశారు. తమ ఓట్లతో గెలిచి అసెంబ్లీకి వెళ్లిన ఆయన తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని, గ్రామంలో వెంటనే రోడ్డు వేయించకపోతే చెప్పులతో కొట్టి చంపేస్తామని హెచ్చరించారు. మహదేవ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై ఎన్నికైన రవి సోంకర్‌ తీరుకు వ్యతిరేకంగా పలువురు మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే ఆయన అసెంబ్లీకి వెళ్లారని గుర్తు చేశారు. ఎన్నికైన తర్వాత గ్రామ ప్రజల కోసం ఒక్క రోడ్డు కూడా వేయించలేకపోయారని బీజేపీ మహిళా మోర్చా మాజీ మండలాధ్యక్షురాలు శకుంతల ఆగ్రహం వ్యక్తం చేశారు. రవికి మళ్లీ ఓట్లు అడిగే అర్హత లేదని, వెంటనే రోడ్డు వేయకుంటే చెప్పులతో కొట్టి చంపేస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది.

Related posts

తెలుగు తల్లి, తెలంగాణ బిడ్డ అంటూ షర్మిలకు గద్దర్ ప్రశంసలు..!

Drukpadam

వ్యవసాయచట్టాలపై నోరుజారి నాలుక కరుచుకున్న కేంద్ర మంత్రి తోమర్ !

Drukpadam

జగన్ వన్నీ తాత లక్షణాలు.. వైఎస్ కూడా ఇంత దారుణంగా లేరు: యనమల !

Drukpadam

Leave a Comment