Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అసైన్డ్ భూముల వ్యవహారంలో ఈటలకు మళ్లీ నోటీసులు

అసైన్డ్ భూముల వ్యవహారంలో ఈటలకు మళ్లీ నోటీసులు
-ఈటలపై అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు
-గత జూన్ లోనే నోటీసులు
-కరోనా కారణంగా నిలిచిన విచారణ
-హైకోర్టు ఆదేశాలతో కదిలిన అధికారులు
-ఈ నెల 16 నుంచి మళ్లీ విచారణ

ఇటీవలే హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయనను అసైన్డ్ భూముల వ్యవహారం వెంటాడుతోంది. ఈటల అర్ధాంగి జమున పేరిట ఉన్న హేచరీస్ కు గత జూన్ లోనే నోటీసులు పంపారు. ఈ అంశంలో రెవెన్యూ అధికారులు ఈటల కుటుంబ సభ్యులకు మరోసారి నోటీసులు పంపారు.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిలిచిన విచారణను అధికారులు హైకోర్టు ఆదేశాలతో పునఃప్రారంభించనున్నారు. ఈ నెల 16 నుంచి హకీంపేట, అచ్చంపేట భూముల్లో సర్వే చేపట్టనున్నారు.

హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో ఈటల అసైన్డ్ భూములను ఆక్రమించినట్టు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన మంత్రి పదవిని కోల్పోవడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జరిగాయి.

Related posts

నల్గొండలో కుందూరు రఘువీర్ రెడ్డికి 5 లక్షలకు పైగా మెజార్టీ…

Ram Narayana

బిగ్ బాస్ రియాలిటీ షో ? ఎక్కడో లెక్క తప్పుతుంది…

Drukpadam

బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే నితీశే రాష్ట్రపతి అభ్యర్థి అవుతారు: ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్!

Drukpadam

Leave a Comment