Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియా సమావేశంలోకి దూసుకొచ్చిన విద్యార్థి సంఘాలు!

మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియా సమావేశంలోకి దూసుకొచ్చిన విద్యార్థి సంఘాలు!
-అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జి
-విజయవాడలో మంత్రి ఆదిమూలపు ప్రెస్ మీట్
-మంత్రిని అడ్డుకున్న విద్యార్థి సంఘాలు
-లాఠీచార్జి వ్యవహారం తన మంత్రిత్వ పరిధిలోకి రాదన్న మంత్రి

ఏపీ లో ఎయిడెడ్ కళాశాలల పై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాపితంగా నిరసనలకు విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై అనంతపురం లో పోలీసులు లాఠీచార్జి జరిపారు. దీనిపై విద్యార్ధి సంఘాలు భగ్గుమన్నాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశాన్ని అడ్డుకున్నాయి. గందరగోళం చేశాయి. లాఠీచార్జి విషయం తనపరిధిలోది కాదని మంత్రి విద్యార్ధి సంఘ నాయకులకు చెప్పారు. చివరకు వారు మంత్రికి ఎయిడెడ్ పాఠశాలలపై మెమోరాండం ఇచ్చారు.

అనంతపురంలో ఎయిడెడ్ కళాశాల విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇవాళ విజయవాడ ఆర్ అండ్ బి భవనంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియా సమావేశం నిర్వహిస్తుండగా, విద్యార్థి సంఘాల నేతలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. మంత్రి సురేశ్ మీడియా సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వీలుకాకపోవడంతో సమావేశం ముగిశాక మంత్రిని అడ్డగించారు.

అనంతపురం లాఠీచార్జి ఘటనపై తమ నిరసన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల ప్రతినిధులు మంత్రి సురేశ్ తో వాగ్యుద్ధానికి దిగారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులను కొనసాగించాలని స్పష్టం చేశారు. ప్రైవేటు యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తే చదివేవారు ఎలా భరిస్తారని మంత్రిని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలను విద్యార్థులు కోల్పోతారని వివరించారు. మంత్రికి వినతిపత్రాలు అందజేశారు.

విద్యార్థి సంఘాల డిమాండ్లపై మంత్రి ఆదిమూలపు స్పందిస్తూ, తాము చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేస్తున్నామని, ఇచ్చిన మాట ఎక్కడైనా తప్పితే మీరు నిలదీయండి అని సూచించారు. పోలీసుల లాఠీచార్జి వ్యవహారం తన విద్యాశాఖకు చెందిన విషయం కాదని, తన విద్యాశాఖకు సంబంధించిన సమస్యలపై తాను సమాధానం చెబుతానని అన్నారు.

Related posts

చీమలు చిన్నవే కానీ.. వాటి లెక్కలు పెద్దవి.. 

Drukpadam

జర్నలిస్టులకు హెల్ప్‌ డెస్క్ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

Drukpadam

సంగం డైరీ వ్యవహారంలోనూ ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బే!

Drukpadam

Leave a Comment