Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీనే దేశానికి శ్రీరామ రక్ష … కొన్ని పార్టీలు కావాలని కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నాయి : భట్టి

కాంగ్రెస్ పార్టీనే దేశానికి శ్రీరామ రక్ష … కొన్ని పార్టీలు కావాలని కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నాయి : భట్టి
-దేశంలో రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి… శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీనే
-కొంపల్లిలో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వాల నమోదు
-కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని భట్టి వ్యాఖ్యలు
-కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ లను ఓడించాలని పిలుపు

ప్రజావ్యతిరేకవిధానాలు అవలంబిస్తున్న బీజేపీని ,టీఆర్ యస్ ను ఓడించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి భట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకురాగల ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. దేశంలో రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి… కానీ శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ,దేశంలో పాలిస్తున్న పాలకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలో ఘోరంగా విపహలమయ్యారని దుయ్యబట్టారు . దేశానికి కాంగ్రెస్ ఏమి చేసిందని కొత్తగా వచ్చిన కొందరు ప్రశ్నిస్తుంటారని .కాంగ్రెస్ చరిత్ర త్యాగాలు చెప్పాలంటే పెద్ద పెద్ద గ్రంథాలు కావాల్సి ఉంటుందని అన్నారు. యువకులు కాంగ్రెస్ చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. ప్రాజెక్టు లు కట్టింది కాంగ్రెస్ , దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ , గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించింది కాంగ్రెస్ , పేదలకు ఇల్లు కట్టించింది. కాంగ్రెస్ , బడులు, వైద్యరంగాన్ని పేదల చెంతకు తెచ్చింది కాగ్రెస్ అని భట్టి తన ప్రసంగంలో ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పై కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశం కోసం ఇందిరమ్మ కుటుంబం చేసిన త్యాగాల ముందు ఏ పార్టీ నాయకులు కూడా సరిపోరని భట్టి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి పదవి తన ముందు నిలిచినా వద్దనుకున్న త్యాగమూర్తి సోనియా గాంధీ అని వివరించారు. దేశంలో రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, గాంధేయవాదమే కాంగ్రెస్ భావజాలమని స్పష్టం చేశారు.

దేశం మతోన్మాద శక్తుల చేతుల్లో చిక్కుకుందని, దేశాన్ని ఓవైపు బీజేపీ పట్టిపీడిస్తుంటే, మరోవైపు రాష్ట్రాన్ని టీఆర్ఎస్ దోచుకుంటోందని అన్నారు. ఈ రెండు పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.

Related posts

వంగవీటి రాధా-వల్లభనేని వంశీ భేటీ.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్!

Drukpadam

మాజీ నక్సలైట్ ను తన బస్సులోకి పిలిపించుకొని మాట్లాడిన సీఎం కేసీఆర్!

Drukpadam

ఇకపై కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు: పెద్దిరెడ్డి!

Drukpadam

Leave a Comment