Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నువ్వు దీపావళి బాంబు వదిలావు… రేపు నేను హైడ్రోజన్ బాంబు వదులుతా: ఫడ్నవీస్ కు నవాబ్ మాలిక్ కౌంటర్!

 

నువ్వు దీపావళి బాంబు వదిలావు… రేపు నేను హైడ్రోజన్ బాంబు వదులుతా: ఫడ్నవీస్ కు నవాబ్ మాలిక్ కౌంటర్!

  • -రాజకీయ రంగు పులుముకున్న డ్రగ్స్ వ్యవహారం
  • -ఫడ్నవీస్, మాలిక్ మధ్య మాటల యుద్ధం
  • -ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు
  • -ఫడ్నవీస్ కు లీగల్ నోటీసులు పంపుతానని మాలిక్ వెల్లడి

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ వ్యవహారం కాస్తా మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ‘ఫడ్నవీస్ ఓ డ్రగ్స్ సప్లయర్ తో కలిసి ఉన్న ఫొటో’ అంటూ ఇటీవల మంత్రి నవాబ్ మాలిక్ ఓ ఫొటో విడుదల చేయగా, నవాబ్ మాలిక్ కు మాఫియాతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ ఫడ్నవీస్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ స్థలం కొనుగోలును ఈ సందర్భంగా ప్రస్తావించారు. అండర్ వరల్డ్ సహకారం లేకుండా ఎంతో తక్కువ ధరకు ఎలా కొనగలిగారని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో మంత్రి నవాబ్ మాలిక్ స్పందించారు. ‘నువ్వు దీపావళి బాంబు వదిలావు… రేపు నేను హైడ్రోజన్ బాంబు వదులుతున్నా’ అంటూ హెచ్చరించారు. దేవేంద్ర ఫడ్నవీస్ కు మాఫియాతో ఉన్న లింకులు బట్టబయలు చేస్తానని, ఫడ్నవీస్ కు లీగల్ నోటీసులు కూడా పంపిస్తానని మాలిక్ వెల్లడించారు. ముంబయి పేలుళ్ల దోషులతో సంబంధాలు ఉన్నాయంటూ తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

 

Related posts

తాను బీకాం చదవలేదని అశోక్ బాబు స్వయంగా చెప్పారు: విజయసాయిరెడ్డి

Drukpadam

కేంద్ర దర్యాప్తు సంస్థలపట్ల జాగ్రత్త :మంత్రులతో కేసీఆర్!

Drukpadam

రాహుల్ యాత్రలో కీలక పరిణామం.. వేదికపై కాలు కదిపిన గెహ్లాట్, పైలట్!

Drukpadam

Leave a Comment