Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెరాస పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఘాటు వ్యాఖ్యలు…

తెరాస పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఘాటు వ్యాఖ్యలు…
కేంద్రానికి భయపడే కేసీఆర్ ఇంతకాలం లేఖ విడుదల చేయలేదా..?
కేసీఆర్ ఢిల్లీ డ్రామాలెందుకు
రైతులు చనిపోయాక వారి అంత్యక్రియల కార్యక్రమల కోసం ధాన్యం కొనాలని అడిగేందుకు డిల్లీకి కెసిఆర్
వెళతారా…?
కెసిఆర్ సమయానికి అనుకూలంగా “అపరిచితుడిగా” మారుతాడు…!
ధాన్యం కొనుగోలు విషయంలో రాజకీయాలు తగదు

ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం లేఖ ఇస్తే.. కెసిఆర్ ఇంతకాలం ఎందుకు బయటపెట్టలేదు..లేఖపై రాజకీయంగా ఎందుకు ఒత్తిడి చేయలేదు..? తన పాలనలో చేసిన తప్పులకు ఎప్పుడూ శిక్ష వేస్తారోనని భయపడే ఇంతకాలం లేఖ విడుదల చేయలేదా..?
ఎన్నికల్లో ఓడిపోవడంతో కెసిఆర్ అభద్రతాభావంలో వున్నారు.. వరి కొనుగోలు విషయంలో తెరాస , బీజేపీ డ్రామాలాడుతున్నారు – మీ డ్రామాలు కట్టిపెట్టి రైతులకు మేలు చేసేవిధంగా వ్యవహరించండి. లేక పొతే రైతుల పక్షాన పోరాడేందుకు సిపిఎం సిద్ధంగా ఉంది ఇప్పటికే మేము వరిధాన్యం కొనుగోళ్లపై ఆందోళనకు పిలుపు నిచ్చాం . అనే రోజు టీఆర్ యస్ ఇచ్చిందని అందువల్ల తమ తేదీని మార్చుకొనే ఆలోచనలో ఉన్నామని అన్నారు .

వరి సాగు, ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు రాజకీయ నాటకాలు ఆడటం తగదని తమ్మినేని అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకవైపు రాష్ట్ర బిజెపి నాయకులు రైతులను వరి సాగు చేయాలని, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వరి సాగు చేయవద్దని భిన్న వాదనలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వరి పంట వద్దని చెబుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, వరి పండే భూముల్లో ఏం పంట వేయాలో ఆయనే రైతులకు చెప్పాలని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామని చెప్పారని, ఇప్పుడు మాత్రం ఒక్క గింజనూ కొనుగోలు చేసేది లేదని మాట మారుస్తున్నారని ఆయన విమర్శించారు. అలాగే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగం పండించిన వారిని సేకరించి, పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయడంలో విఫలం అవుతుందని అన్నారు. మొత్తంగా వరి సాగు, ధాన్యం కొనుగోలు విషయంలో *టి.ఆర్.ఎస్., బిజెపి నాయకులు సై అంటే సై అంటూ, రైతుల సమస్యలను *పట్టించుకోవడం లేదని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఇలాంటి వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు . రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇచ్చి, వారికి చట్టపరమైన హక్కులను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, ఎం. సాయిబాబు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, జిల్లా కమిటి సభ్యులు పాల్గొన్నారు.

Related posts

కోమటిరెడ్డి వెంకట్రెడ్డివి కోవర్ట్ రాజకీయాలే …పాల్వాయి స్రవంతి విమర్శ !

Drukpadam

మోదీతో భేటీ అయిన మమతా బెనర్జీ!

Drukpadam

ఆప్ పిలుపునకు విశేష స్పందన 24 గంటల్లో 8 లక్షల మంది సీఎం అభ్యర్థిపై ఓటు!

Drukpadam

Leave a Comment