Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వాసుపత్రిలో భార్యకు ప్రసవం చేయించిన భద్రాద్రి కలెక్టర్…

ప్రభుత్వాసుపత్రిలో భార్యకు ప్రసవం చేయించిన భద్రాద్రి కలెక్టర్…
-మంగళవారం అర్ధరాత్రి పురిటినొప్పులు
-భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లిన అనుదీప్
-సిజేరియన్ చేసిన వైద్యులు
-కలెక్టర్ దంపతులకు పండంటి మగబిడ్డ జననం

ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడిపోతున్న కాలమిది. సేవలు సరిగ్గా అందవని, మంచి చికిత్స చేయరని చాలా మంది వాటివైపు కూడా వెళ్లడం లేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెంచేందుకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ముందడుగు వేశారు. తన భార్య మాధవికి ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవం చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవి గర్భిణీ కావడంతో తొలి కాన్పు కోసం భద్రాచలం మంగళవారం అర్ధరాత్రి పురిటినొప్పులతో బాధపడుతున్న భార్యను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు ఎమర్జెన్సీగా గర్భిణీకి ఆపరేషన్ అవసరం అవడంతో ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు గైనకాలజిస్టు లు సూరపనేని.శ్రీక్రాంతి, డాక్టర్ భార్గవి, అనస్థీషియా వైద్య నిపుణులు దేవికల ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయడంతో తో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొంతకాలంగా ఆమె ఇక్కడే పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెంచేందుకు కలెక్టర్ చేసిన ప్రయత్నంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఆపరేషన్ అనంతరం శిశువును ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వై రాజశేఖర్ రెడ్డి శిశువుకు పరీక్షించి వైద్యాన్ని అందజేశారు. ఒక జిల్లా కలెక్టర్ సామాన్యుల్లాగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకోవడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులపై మరింత గౌరవం పెరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్డెంట్ ముక్కంటి వెంకటేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ ముదిగొండ రామకృష్ణా, ఇతర ప్రభుత్వ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

కొన్ని రోజుల క్రితం ఖమ్మం అడిషనల్ కలెక్టర్ స్నేహలత కూడా ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవం చేయించుకున్నారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అంతకుముందు భూపాలపల్లి కలెక్టర్ గా పనిచేసిన ఆకునూరి మురళి కూడా తన కూతురు ప్రగతికి ప్రభుత్వాసుపత్రిలోనే డెలివరీ చేయించారు.

ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశంశలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దంపతులపై తెలంగాణ ఆర్థికశాఖ, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశంసల జల్లు కురిపించారు. అనుదీప్ తన భార్య మాధవికి ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హరీశ్ ట్విట్టర్ లో వారికి అభినందనలు తెలిపారు.

‘‘భద్రాద్రి కలెక్టర్, ఆయన భార్యకు శుభాకాంక్షలు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వైద్యారోగ్య మౌలిక వసతులు మెరుగయ్యాయనేందుకు ఇదే నిదర్శనం. ప్రజలకు ప్రభుత్వాసుపత్రులే మొదటి చాయిస్ అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Related posts

పోలీసు వ్యవస్థ బలపడింది: డీజీపీ మహేందర్‌ రెడ్డి

Drukpadam

మాజీ సీఎం జ‌గ‌న్‌కు షాక్‌.. ఆ భూములు వెన‌క్కి తీసుకుంటూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు!

Ram Narayana

ముంబైలోని ఏడంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురి మృతి

Ram Narayana

Leave a Comment