Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీలో సీఎం జగన్ ఆమోదంతో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన !

ఏపీలో సీఎం జగన్ ఆమోదంతో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన !
– జాబితా విడుదల చేసిన సజ్జల
-ఎమ్మెల్యే కోట నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు వెల్లడి
-వీరిలో డిసి గోవిందరెడ్డి , విక్రాంత్ ,ఇషాక్ భాషా
-స్థానిక సంస్థలనుంచి 11 మంది పేర్లు సిద్ధం …
-అందులో సీనియర్ నేత ఉమ్మారెడ్డి , తలశిల రఘురాం , మర్రి రాజశేఖర్ పేర్లు
-కులాలు ప్రాంతాల వారీగా ఎంపిక

వైసీపీ నుంచి ఎమ్మెల్సీల అభ్యర్ధులను పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో మూడు..స్థానిక సంస్థల కోటాలో 11 స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అయితే, అటు శాసనసభలో..ఇటు 13 జిల్లాల స్థానిక సంస్థల్లో వైసీపీ పూర్తి మెజార్టీ ఉండటంతో మొత్తం 14 స్థానాలు వైసీపీ ఖాతాలోనే జమ కానున్నాయి. చివరి నిమిషం వరకు పెండింగ్ లో పెట్టకుండా ముందుగానే అభ్యర్ధుల ను ఖరారు చేయటం ద్వారా పార్టీలో ఎటువంటి గందరగోళానికి అవకాశం లేకుండా సీఎం జగన్ జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆమోదించిన జాబితాను సజ్జల ప్రకటించారు.

ప్రాంతీయ సమీకరణాలను పక్కగా అమలు చేస్తూ అభ్యర్ధుల ఎంపికను పూర్తి చేసారు. అందులో భాగంగా.. ఎమ్మెల్యే కోటా నుంచి తాజాగా పదవీ విరమణ చేసిన డీసీ గోవిందరెడ్డి… బీసీ కోటాలో శ్రీకాకుళం జిల్లా పాలవలస రాజశేఖర్ కుమారుడు విక్రాంత్ పేరు ఖరారు చేసారు. మూడో స్థానం నుంచి మైనార్టీ కోటాలో భాగంగా.. కర్నూలు జిల్లా నుంచి నంధ్యాలకు చెందిన మార్కెట్ యార్డు ఛైర్మన్ ఇషాక్ భాషా పేరు ప్రకటరించారు. ఇక, స్థానిక సంస్థల కోటా అభ్యర్ధుల పేర్లు త్వరలో ప్రకటించనున్నారు.

అయితే, ఇప్పటికే ఆ పేర్లకు సైతం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. విజయనగరం నుంచి రఘురాజు పేరు దాదాపు ఖరారైంది. విశాఖలో రెండు స్థానాలు ఉండగా.. ఒక స్థానం నుంచి వంశీ క్రిష్ణ , కాగా, రెండో స్థానం నుంచి విరుదు కళ్యాణి పేరు ఖరారు చేసినట్లు సమాచారం. తూర్పు గోదావరి నుంచి అనంత ఉదయ భాస్కర్ పేరు దాదాపు ఖరారైంది. కృష్ణా జిల్లా నుంచి రెండు స్థానాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రభుత్వ సలహాదారుడు తలశిల రఘురాంకు కేటాయించగా, రెండో స్థానం బీసీ వర్గానికి కి ఖరారు చేసారు.

గుంటూరు నుంచి రెండు స్థానాలు ఉన్నాయి. అందులో ఒకటి తాజాగా ఎమ్మెల్సీగా రిటైరైన ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు.. కాగా, రెండో స్థానం నుంచి మర్రి రాజశేఖర్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోందిజ. ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు అభ్యర్దిత్వానికి ఆమోద ముద్ర వేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా నుంచి కుప్పం ఇన్ఛార్జ్ గా ఉన్న భరత్ పేరును ఓకే చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ 11 పేర్లను ఒకటి రెండు రోజల్లో వైసీపీ అధినాయకత్వం అధికారికంగా ప్రకటించనుంది.

 

 

Related posts

గుజరాత్​ లో ఆప్​ గెలిస్తే 300 యూనిట్ల ఉచిత కరెంట్ ​.. బకాయిలూ మాఫీ: కేజ్రీవాల్​

Drukpadam

అసెంబ్లీ అభ్యర్థులపై బీఆర్ యస్ లీకులు …కరీంనగర్ లోకసభకు అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్ …

Drukpadam

కేటీఆర్ తో కలిసి ఢిల్లీకి వెళ్లిన మంత్రులు!

Drukpadam

Leave a Comment