జగన్ వన్నీ తాత లక్షణాలు.. వైఎస్ కూడా ఇంత దారుణంగా లేరు: యనమల రామకృష్ణుడు!
వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు
ఏపీ అంటేనే నెగెటివ్ అన్న ముద్ర పడింది
పెట్టుబడులు పెట్టడం లేదు
యువతకు తీవ్ర నష్టం తప్పదంటున్న యనమల
ఏపీ సీఎం జగన్ పై మాజీ ఆర్థిక మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ వన్నీ తాత రాజారెడ్డి లక్షణాలు అని విమర్శించారు . తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇంత దారుణంగా వ్యవహరించలేదని అన్నారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసిన చరిత్ర జగన్ ది అని దుయ్యబట్టారు .ఏపీ అంటేనే నెగిటివ్ ముద్రపడింది ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు రావడంలేదని అన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్రంగా నష్టపోతుందని వాపోయారు …
వైఎస్ జగన్ కు అన్నీ తాత లక్షణాలు అలవడ్డాయని, ఆయన పాలనతో ఆంధ్రప్రదేశ్ కు, రాష్ట్ర ప్రజలకు తీరని నష్టమని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ పాలనలో రాష్ట్ర వృద్ధి రేటు తిరోగమనంలో ఉందన్నారు. ఇవాళ ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రులెవరూ ఇంత దారుణంగా పాలించలేదని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. కష్టపడి తెచ్చుకున్న ప్రజాస్వామ్యాన్ని.. సొంతానికి వాడుకుంటూ ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.
నియంత పాలనను సాగిస్తున్నారని మండిపడ్డారు. ‘ఆఫ్ ద వైసీపీ.. ఫర్ ద వైసీపీ.. బై ద వైసీపీ’ అన్న చందంగా పాలన ఉందన్నారు. ప్రపంచంలో ఏపీ అంటేనే నెగెటివ్ అన్న ముద్ర పడిపోయిందని, సంస్థలేవీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. దీని వల్ల యువత తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందన్నారు. ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదని, జగన్ తండ్రి వైఎస్ కూడా ఇంత దారుణంగా ప్రవర్తించలేదని గుర్తుచేశారు.