రైతన్నలారా పోరాటానికి సిద్ధం కండి౼ మంత్రి పువ్వాడ…
– కేంద్రం మెడలు వంచి మన వడ్లను కొనిపిద్దాం.
– రేపు 12న చేపట్టే ధర్నా ను విజయవంతం చేయాలని పిలుపు.. రైతులు,పార్టీశ్రేణులు పెద్ద ఎత్తున స్వచ్ఛదంగా పాల్గొనండి.
– ధర్నా విజయవంతం చేయాలని కోరుతూ ఖమ్మం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో సమావేశం.
వడ్లు కొనేదాకా ఆందోళనలు: మంత్రి పువ్వాడ
ధాన్యం కొనుగోలుపై శుక్రవారం టీఆర్‌ఎస్ తలపెట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ శ్రేణులు, రైతులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రైతులతో ధర్నాలు చేయాలని కోరారు. రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నేతలు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇండ్ల ముందు ధర్నా చేయాలన్నారు. కేంద్రం రైతుల నోట్లో మట్టి కొట్టేలా ధాన్యం కొనుగోలుకు ససేమిరా అనడం.. రైతులు పండించిన పంటలను లాభనష్టాలు చూడకుండా కొనుగోలు చేయాల్సిన కేంద్రం.. వారితో వ్యాపారం చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు.
అన్నదాతకు దన్నుగా మంత్రి అజయ్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే టీ రామారావు పిలుపు మేరకు ఖమ్మం నగరంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్ లో జరిగే నిరసన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొననున్నారు. రైతాంగానికి అండగా ఖమ్మం గులాబీ దళం వెన్నుదన్నుగా నిలిచేందుకు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను దునుమాడేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్వర్యంలో ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి.
ఈ ఆందోళన కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించిన అనంతరం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ అనుమతి పొందారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైతాంగాన్ని గందరగోళానికి గురిచేస్తున్నదని టీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. పంట చేతికొచ్చినా కొనుగోలు విషయం తేల్చకుండా కేంద్రం అనుసరిస్తున్న నాన్చుడు ధోరణిని ధర్నా సందర్భంగా ఎండగట్టాలని నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు, ఆయా రైతుబంధు సమితుల ప్రతినిధులు, రైతులు భారీ ఎత్తున పాల్గొని నిరసన ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు రైతులను తప్పుదారి పట్టించేలా చేస్తున్న వ్యాఖ్యలను రైతాంగం ముందు ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ధర్నా విజయవంతం చేయాలని కోరుతూ ఖమ్మం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో సమావేశం.
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపూరిత వైఖరిపై ఈ నెల 12న టి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఖమ్మం నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లతో సమావేశమైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ….
ఆహార భద్రత చట్టం ప్రకారం రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనాలి.. కానీ అందుకు వ్యతిరేకంగా కొనమని చెప్పడం కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా నిలిచిందన్నారు. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ తెర్లు కాకుండా, సీఎం కేసీఆర్ ఎంతో ఇష్టంగా బాగు చేస్తూ, బంగారు తెలంగాణ చేస్తున్నారని తెలిపారు.
రాజ్యాంగం, వ్యవసాయ చట్టాల్ని అనుసరించి, పంటల్ని కొనుగోలు చేసే బాధ్యతను కేంద్రానికే ఇచ్చారన్నారు. తద్వారా ఏ రాష్ట్రానికి కనీస మద్దతు ధర నిర్ణయించే అధికారం, కొనుగోలు చేసి నిల్వ చేసే ఎఫ్.సి.ఐ లాంటి సంస్థల్ని ఏర్పాటు చేసే అదికారం, స్వంతంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొని నిల్వ చేసి ఎగుమతి చేసే అదికారం, సైంటిఫిక్ గోదాముల్ని నిర్వహించే అధికారం లేదని తెలిపారు.
రైతుల పంట కేంద్రం కొనడం భిక్ష కాదని, అది రాష్ట్రాల ప్రజాస్వామ్యబద్దమైన రైతుల హక్కని అన్నారు. గతంలో లేవీ విదానం ఉన్నప్పుడు కేంద్రమే వరి పండించండి అని ప్రోత్సహించిందని తద్వారా వరి పంట సాగు క్రమంగా అలవాటైందన్నారు.
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ గా బాసిల్లింది.. కానీ దాన్ని అధిగమించి తెలంగాణ ప్రభుత్వ సహకారంతో వ్యవసాయం పండగల మారిందన్నారు. తద్వారా నేడు తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ గా కీర్తి సాదించిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయం పండుగ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతు నడ్డి విరిచేలా ఉన్నాయని మంత్రి అన్నారు..
కేంద్రం వచ్చే యాసంగి వడ్లను కొంటామని, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కేంద్రం నుండి ఆర్డర్ కాపీ తీసుకురావాలి అని మంత్రి డిమాండ్ చేశారు..
ఇతర రాష్ట్రం లో వడ్లను ఎలా కొంటారు.. తెలంగాణ రాష్ట్రంలో వడ్లను ఎందుకు కొనరు ? పంజాబ్ లో వడ్లను కొన్నట్లే తెలంగాణ లో కూడా వడ్లను కేంద్రం కొనాలి అని మంత్రి డిమాండ్ చేశారు.
తెలంగాణలో వానాకాలం వడ్ల సేకరణ దాదాపు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ ఈ సీజన్ కి కూడా కేంద్రం వడ్లు కొంటామని లికితపూర్వక ఆర్డర్ కాపీ ఇవ్వలేదని అన్నారు.
ఈ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం కొన్న వడ్లను మరియు యాసంగి లో రైతులు పండించే వడ్లను కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వము లికితపూర్వక ఆర్డర్ కాపీ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు..
రైతులు పండించిన పంటలకు కేంద్రం కొనాలని, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఖమ్మంలో బీజేపీని నిలువనియ్యను.. తిరగనియ్యనని హెచ్చరించారు.
రేపు 12న ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ లో ఉదయం 9:00 గంటల నుండి 12 గంటల వరకు చేపట్టే ధర్నాలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జరిగే ధర్నా కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి కేంద్రం మెడలు వంచి కేంద్రంచే వడ్లు కొనిపిద్దాం అని కేంద్రం దిగివచ్చే వరకు ఆందోళన ఆగదని రేపటి ధర్నా ను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు….