Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్రంపై యుద్ధం ప్రకటించిన టీఆర్ యస్ …

కేంద్రంపై టీఆర్ యస్ విశ్వరూపం …బీజేపీ పై ఎదురు దాడి
-నేడే రాష్ట్రవ్యాపిత ధర్నాలు …పాల్గొననున్న మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు
-మీడియా సమావేశాల్లో బీజేపీ ని చీల్చి చండాడిన కేసీఆర్
-బీజేపీ పై ఇక యుద్ధమేనన్న మంత్రి గంగుల కమలాకర్
-ధాన్యం కొనుగోళ్లు చేయాలనీ బీజేపీ రాష్ట్రవ్యాపిత ధర్నాలు
-రాష్ట్రంలో కాదు ఢిల్లీలో ధర్నాలు చెయ్యండని టీఆర్ యస్ హితవు

ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య యుద్ధం జరుగుతుంది. వరిపంట వేయవద్దని రాష్ట్రప్రభత్వం చెపుతుండగా , వరి వేయండని బీజేపీ ప్రచారం చేస్తుంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయటం లేదని అందువల్ల యాసంగిలో రైతులు ప్రత్యాన్మాయ పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. బీజేపీ వరి వేసుకోండని ప్రచారం చేస్తుంది. రైతులు ఈ రెండు పార్టీల మాటల యుద్ధం లో నలిగిపోతున్నారు. వరి వేసుకోవాలా వద్ద అనే స్నాదేహంలో ఉన్నారు . కేంద్రవైఖరిని నిరసిస్తూ టీఆర్ యస్ శుక్రవారం ధర్నాలకు పిలుపునిచ్చింది . ఇందులో మంత్రుల్లో ఎంపీలు ,ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , జిల్లాపరిషత్ చైర్మన్లు , ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ యస్ రైతుల సమస్యపై ధర్నాలకు పిలుపు నివ్వడం ప్రతిగా బీజేపీ వారిపిలుపు ఒకరోజు ముందుగానే గురువారమే ధర్నాలు చేయడం రాజకీయ వాతారణం వేడెక్కింది. కేంద్రంపై తన విశ్వరూపం చూపించేందుకు టీఆర్ యస్ సిద్ధమైంది. టీఆర్ యస్ ను బలహీన పరచడం ద్వారా రాజకీయలబ్ది పొందాలని బీజేపీ పావులు కదుపుతుంది.

బీజేపీ పై పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజం ….

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ బిజెపి నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినా ధాన్యం కొనుగోలు ఆపేది లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కావాలని బిజెపి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణాలో నిరంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని ఎమ్మెల్సీ పల్లా పేర్కొన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు కూడా చేస్తున్నామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

ఎఫ్సిఐ ద్వారా కేంద్రం రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేయాలని కనీసం ఆ సమాచారం లేనివారు కూడా ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారని బండి సంజయ్ ను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు . ఇప్పటికే 3500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వెయ్యి కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పై బీజేపీ అనవసరపు విమర్శలు చేస్తోందని, విమర్శలు ఆపి కేంద్రాన్ని ధాన్యం కొనేలా ఒప్పించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

బిజెపి నాయకుల మాటలు విని రైతులు ఆగం కావద్దని పల్లా రాజేశ్వర్ రెడ్డి హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు జరుగుతుంటే బీజేపీ ఆందోళనలు ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని పేర్కొన్న ఆయన బిజెపి రాష్ట్రంలో కాదు ఢిల్లీలో ధర్నాలు చేయాలంటూ సెటైర్లు వేశారు. తెలంగాణా రాష్ట్రంలో కొంత కాలంగా వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం దుమారంగా మారిన విషయం తెలిసిందే. వరి సాగు చెయ్యొద్దని సర్కార్, సాగు చేసుకోవచ్చని బీజేపీ మాటల యుద్ధానికి తెరతీశాయి. కేంద్రం ధాన్యం కొనుగోలు చెయ్యటం లేదని, వరి సాగు చెయ్యొద్దని, ప్రత్యామ్నాయ పంటలను వెయ్యాలని టీఆర్ఎస్ సర్కార్ రైతులకు చెప్తుంది.

బీజేపీ తో ఇక యుద్ధమే …గంగుల

సీఏం కేసీఆర్ రైతు అనుకూల విదానాలు..ఖచ్చితంగా వరి కొంటామన్న మంత్రి గంగుల వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయని గతంలోని 6500 కన్నా ఎక్కువగా రాష్ట్రవ్యాప్తంగా 6663 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు నిర్ణయించామన్నారు మంత్రి గంగుల కమలాకర్. సీఎం ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అధికారం కలెక్టర్లకే ఇచ్చామన్నారు. పంటలు వస్తున్న దానికి అనుగుణంగా రోజూ వారీగా దాదాపు 400 కొత్త కేంద్రాలు ఏర్పాటవుతున్నాయన్నారు. ఇప్పటికే 3550 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని, 72,000 పద్దుల ద్వారా 5,15,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని వీటి విలువ వెయ్యికోట్లు ఉంటుందన్నారు. గురువారం బీజేపీ జిల్లాల్లో నిర్వహించే దర్నాలపై ద్వజమెత్తారు మంత్రి గంగుల. బీజేపీ నేతలు దర్నా అంటే రైతులకు మద్దతుగా దర్నా చేస్తారనుకున్నాం, కానీ అర్థం పర్థం లేని దర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు మంత్రి గంగుల.

వానాకాలం పంట కొనాలి గాని బీజేపీ దర్నా చేయడం శోచనీయం అన్నారు. వానాకాలం పంట ప్రతీ గింజ కొంటామని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేసిన విషయం అర్థంకాని దద్దమ్మలు బీజేపీ నేతలన్నారు మంత్రి. కేంద్రం తీసుకుంటామని స్పష్టంగా చెప్పకపోయినా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి, చురుగ్గా కొనుగోళ్లు నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 20 నుండి 30 వేల కోట్ల పంటను ముందే వెచ్చించి వానాకాలం పంట కొంటున్నామని తెలిపారు. ఈ వడ్లను మిల్లింగ్ చేసి ఎఫ్.సి.ఐ అడిగిన ప్రకారం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామన్నారు. కిషన్ రెడ్డి కాని, బండి సంజయ్ కానీ ఇతర బీజేపీ నేతలెవరైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ బియ్యం మొత్తం తీసుకునేలా ఒప్పించగలరా అని మంత్రి గంగుల ప్రశ్నించారు.

పౌరసరఫరాల శాఖ మంత్రిగా పూర్తి బాధ్యతతో వానాకాలం పంట పూర్తిగా కొంటామని గంగుల హామీనిచ్చారు. చేతనైతే బీజేపీ నేతలు, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎవరైనా సరే రాష్ట్రంలో వానాకాలం కొనుగోళ్లు జరగట్లేదని తమ ద్రుష్టికి తీసుకొస్తే స్వయంగా కొనుగోళ్లు జరిపించే బాధ్యత తీసుకుంటానన్నారు. కొనుగోళ్లు నిరాకరించిన ఒక్క రైతు పేరు చెప్పగలరా అని సవాల్ విసిరారు మంత్రి గంగుల. కరోనా సమయంలో రైతులు ఇబ్బంది పడకుండా రెండు మూడు గ్రామాలకు ఒకటి కాకుండా ప్రతీ గ్రామంలో ఉండేవిదంగా గతంలొ 6500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈసారి మరిన్ని పెంచి 6663 కొనుగోళు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. ప్రతీ గ్రామాల్లో రెండు కొనుగోళ్లు కేంద్రాలు సైతం ఏర్పాటు చేసామన్నారు.

Related posts

విజయవాడలో జరిగే సిపిఐ జాతీయసభలకు అతిధిగా కేసీఆర్ !

Drukpadam

కాంగ్రెస్ సాధు జంతువు …బీజేపీ పులి …కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి !

Drukpadam

ఏపీలో లోకేష్ యాత్రకు సిద్ధం…ప్రజాసమస్యలు తెలుసుకోవడమే లక్ష్యం !

Drukpadam

Leave a Comment